Home » Telangana » Hyderabad
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చిన దిల్‌సుక్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతిచెందింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేశారు.
ధరణిపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ధరణి సమస్యలను శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. ధరణిని ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక భేటీ జరిగింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం 1:30గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలతో పలు కీలక అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
హుస్సేన్ సాగర్‌పై అద్భుతంగా వైమానిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఒకే సారి ఆకాశంలో 9 ఎయిర్ క్రాఫ్ట్స్ సందడి చేస్తున్నాయి. సూర్య కిరణ్ టీమ్ ఆధ్వర్యంలో 9 ఎయిర్ క్రాఫ్ట్స్ విన్యాసాలు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యుత్తమమైన 5 బృందాల్లో సూర్యకిరణ్ టీమ్ ఒకటిగా పేరుపొందింది. ఎయిర్ షోకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాత్రమే నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్నానని.. వరంగల్‌లో లాయర్‌గా పనిచేశానని గుర్తుచేశారు. తాను మూడు సార్లు ప్రజా ప్రతినిదిగా పనిచేశానని అన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్‌ది ఏ భావజాలమో బండి సంజయ్ తెలుసుకోవాలని అన్నారు.
మూసీ, హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్లో హరీశ్ రావు ఛార్జ్ షీట్ విడుదల చేశారు.
డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన పలు అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన- విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. విజయోత్సవాల ముగింపు వేడుకలు శనివారం నుంచి సోమవారం వరకూ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ వేడుకల్లో ప్రజలు కూడా భాగస్వాములయ్యేలా కార్యక్రమాలను రూపొందించారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చార్జ్ షీట్ సిద్ధం చేసింది. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేస్తారు. హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని హరీష్ రావు విమర్శించారు.
ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్(Tankbund, Hussain Sagar) పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు.