Share News

Hyderabad: నేడు అంగరంగ వైభవంగా ప్రజాపాలన విజయోత్సవాలు..

ABN , Publish Date - Dec 08 , 2024 | 10:51 AM

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన- విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. విజయోత్సవాల ముగింపు వేడుకలు శనివారం నుంచి సోమవారం వరకూ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ వేడుకల్లో ప్రజలు కూడా భాగస్వాములయ్యేలా కార్యక్రమాలను రూపొందించారు.

Hyderabad: నేడు అంగరంగ వైభవంగా ప్రజాపాలన విజయోత్సవాలు..

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకలు రెండో రోజు(ఆదివారం) అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ షో నిర్వహించనుంది. కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలో వైమానిక విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. నేడు జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.


నేడు జరిగే కార్యక్రమాలు..

ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. 5 గంటల నుంచి 6 గంటల వరకూ వడ్డే శంకర్ బృందం పాటలు పాడి శ్రోతలను అలరించనున్నారు. సాయంత్రం 6 నుంచి 6:45 వరకూ నీలా అండ్ టీమ్ బోనాలు, కోలాటం ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే 6:45 గంటల నుంచి 8 గంటల వరకూ మోహిని అట్టం, భరతనాట్యం, థియేటర్ స్కిట్ ప్రదర్శించనున్నారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకూ రాహుల్ సిప్లిగంజ్ అండ్ టీమ్ మ్యూజికల్ నైట్ నిర్వహించి ప్రేక్షకులను సంగీత ప్రపంచంలో ఊర్రూతలూగించనున్నారు. రెండో రోజు జరిగే ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకలకు పెద్దఎత్తున ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేపట్టారు. అయితే ఎయిర్ షోలో తొమ్మిది సూర్యకిరణ్‌ విమానాలు పాల్గొననున్నాయి. దీన్ని వీక్షించేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల ఏర్పాట్లూ చేయాలని సీఎస్‌ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.


మూడు రోజుల కార్యక్రమాలు ఇవే..

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన- విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. విజయోత్సవాల ముగింపు వేడుకలు శనివారం నుంచి సోమవారం వరకూ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ వేడుకల్లో ప్రజలు కూడా భాగస్వాములయ్యేలా కార్యక్రమాలను రూపొందించారు. మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరి, ఫుడ్‌, హస్తకళలు, సాంస్కృతిక స్టాళ్లు ఏర్పాటు చేశారు. నేడు భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఎయిర్‌ షో, రాహుల్‌ సిప్లిగంజ్‌తో సంగీత కచేరి, ఫుడ్‌, ఇతర స్టాళ్లు ఉంటాయి. రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సీఎం బహిరంగ సభ, డ్రోన్‌ షో, బాణసంచా, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ సంగీత కచేరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. విజయోత్సవాలకు హెచ్‌ఎండీఏ భారీ ఏర్పాట్లు చేసింది.


రేపే ఆ కార్యక్రమం..

సచివాలయంలో ఈనెల 9న కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఐమ్యాక్స్‌ పక్కన గల హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో లక్ష మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ మార్గ్‌లో డ్రోన్‌ షో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హుస్సేన్‌సాగర్‌లో పెద్దఎత్తున బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా కార్యక్రమాల అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ నేతృత్వంలో సంగీత కచేరీ ఉండనుంది. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డులో ఫుడ్‌ స్టాళ్లతోపాటు హస్తకళల, సాంస్కృతిక, పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Gajwel: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..

Hyderabad: నగర వాసులకు బిగ్ అలెర్ట్.. నేడు పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

Updated Date - Dec 08 , 2024 | 10:53 AM