Home » Telangana » Nizamabad
తెలంగాణలో ప్రారంభించిన మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) గ్రాంట్ ఇచ్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు.
జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే.. బతికున్న కూతురికి పెద్దకర్మ చేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రజాస్వామిక పాలన కోసం మరోసారి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్లో ఉద్యమకారులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అనేక సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్‌అలీలు హాజరయ్యారు.
భవిష్యత్తులో కామారెడ్డి గజ్వేల్ తరహాలో అభివృద్ధి చెందడం ఖాయమని వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ కామారెడ్డికి వస్తే జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని జిల్లా మొత్తం సమగ్ర అభివృద్ధి బాట పడుతుందని అన్నారు.
రాష్ట్రంలో వైద్య విద్యతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యాన్ని దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయగా అందులో కామారెడ్డి సైతం ఉంది. దేవునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలతో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అదనంగా ఏర్పాటు చేసిన అనుబంధ ఆసుపత్రి 330 పడకలతో సిద్ధం అయింది. ఈ కళాశాలను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణం వంద కోట్ల రుపాయలతో అభివృద్ధి చెందిందన్నారు. 8 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మించబోతున్నామని తెలిపారు.
జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం నిర్వహించే టెట్ పరీక్ష నిర్వహణలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా కొనసాగేలా తీసుకోవాల్సిన చర్యలపై ఇదివరకే కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డీఈవో రాజులతో కలిసి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్-1, 2 పేపర్ల పరీక్షల కోసం జిల్లా నుంచి 9,740 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
విద్యాశాఖలోని బదిలీలు, పదోన్నతులకు పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు జోరుగా పైరవీలు సాగుతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడం, అభ్యంతరాల ప్రక్రియ కొనసాగుతుండడంతో కొందరు ఉపాధ్యాయులు తమ పలుకుబడిని ఉపయోగించి అధికార పార్టీ నేతలతో అనుకున్న పాఠశాలకు పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్లు విద్యాశాఖలో చర్చ సాగుతోంది.
జిల్లాలో సైబర్ మోసం (Cyber fraud)వెలుగులోకి వచ్చింది. ఆర్మీ జవానని అంటూ నమ్మించి 40 మంది ఆర్మీ జవాన్లకు ఒకేసారి రక్త పరీక్షలు నిర్వహించాలని కామారెడ్డికి చెందిన సూర్ సింగ్ అనే ల్యాబ్ టెక్నీషియన్‌కు సైబర్ కేటుగాడు ఫోన్ చేసి నమ్మించాడు.
దేశంలో రాజకీయ నేతలకు మార్గదర్శిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఉన్నారని తెలంగాణ రాష్ట్ర కమ్మ వారి రాజకీయ ఐక్య వేదిక కన్వీనర్, రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్‌రావు(Vidyasagar Rao) వ్యాఖ్యానించారు.