Home » Telangana » Nizamabad
బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఏరి కోరి కామారెడ్డికి వస్తున్న కేసీఆర్‌కు కామారెడ్డి ప్రజలు ఘోరి కట్టడం ఖాయమని, రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకుని నిజాం తరహా పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ పతనం కామారెడ్డి నుండే ప్రారంభం కానున్నందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. గురువారం భిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో నీట మునిగిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను మోకాలి లోతుకు నడుచుకుంటు వెళ్లి మాజీమంత్రి పరిశీలించారు.
గ్రామ పంచాయతీల్లో మరింత పారదర్శకతకు ప్రభుత్వాలు శ్రీకారం చుడుతున్నాయి. ఆదాయ, వ్యయాలపై నిఘా పెడుతునే ప్రతీ పైసా ప్రజాప్రయోజనాలకు ఖర్చు చేసేలా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. పన్నులు వసూలవుతున్నాయా వసూలైనవి ఏమవుతున్నాయో లెక్కలు చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలో పంచాయతీల బలోపేతానికి, డిజిటల్ పరంగా మరింత ముందుకు నడిపించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎతైన ప్రాంతం కామారెడ్డి నియోజకవర్గమని నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇటీవల సీఎం కేసీఆర్‌కు తాను విన్నవించడంతో స్పందించిన కేసీఆర్ వెంటనే నియోజకవర్గ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.195కోట్లు మంజూరు చేశారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని నాగారాం ప్రాంతంలో స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందింది. గాయత్రి నగర్‌లోని చైతన్య స్కూల్లో చిన్నారి హయతి పి పి 1 చదువుతోంది.
జిల్లాలో రెండు రోజులు గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళ వారం సైతం జిల్లా వ్యాప్తంగా 90.2 మి.మీ వర్షపా తం నమోదైంది. గాంధారిలో కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని మండలాలతో పోలిస్తే గాంధారిలో అత్యధి కంగా 144.5మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గాంధారి, సదాశివనగర్, నాగిరెడ్డిపేట, ఎల్లా రెడ్డి తదితర మండలాల్లోని ప్రాంతాల్లో సుమారు 1200ల ఎకరాలలో వరి, సోయా, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లింది. వరదల తాకిడికి రహదారులు ధ్వంసం అయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కీలక దశకు చేరుకోవడంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో దరఖాస్తుదారుల్లో తీవ్ర టెన్షన్ నెలకొంటుంది. ప్రస్తుతం జరగనున్న స్ర్కీనింగ్ కమిటీ సభ్యుల పరిశీలనలో అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరనుంది. ఎంపిక చేసిన దరఖాస్తుదారుల పేర్లను స్ర్కీనింగ్ కమిటీ ఏఐసీసీకి సీల్డ్ కవర్లో పంపనుంది. స్ర్కీనింగ్ కమిటీ రూపొందించే జాబితాలో తమ పేరు ఉందోలేదోననే ఉత్కంఠ దరఖాస్తుదారుల్లో నెలకొంటుంది.
నిజామాబాద్ జిల్లాలో(Nizamabad District ) దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన పసికందులను ఓ ముఠా విక్రయించబోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆ ముఠా గుట్టురట్టు చేశారు.
విద్యారంగాభివృద్ధికి, ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి విద్యాశాఖకు వారధిగా నిలుస్తు, పేద పిల్లలకు సౌకర్యాలతో కూడిన విద్యను బోధిస్తున్న సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట పట్టారు. పని బారెడు జీతం మూరేడు అనే చందంగా ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. 2008లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సమగ్రశిక్ష అభియాన్ అమల్లోకి వచ్చింది.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం హైకోర్టు గతంలో నిర్వహించిన బదిలీలపై స్టేను ఎత్తివేయడంతో ఆదివారం నుంచి బదిలీ లకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది.