Home » Telangana » Nizamabad
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పార్టీలో ఉన్న నాయకులు మరో పార్టీలోకి చేరగానే ఆ పార్టీ నుంచి ఇంకో నాయకుడిని తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కంటే కామారెడ్డి నియోజకవర్గంలో చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆయా కుల సంఘాల ప్రతినిధులతోను ఆయా పార్టీల ముఖ్యనేతలు టచ్‌లో ఉంటున్నారు. ఇలా ప్రధాన పార్టీలు చేరికలే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
నెల రోజులుగా వర్షాలు లేక రైతన్నలు వర్షం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకూ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరిన గోదావరి వరద జలాల తో శ్రీరాంసాగర్ప్రాజెక్టులోని నీరు రంగుమారి కలు షితం అయిందనే ప్రచారం నెలకొంది. ఈ నేపథ్యం లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచనల మేరకు కలెక్టర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సంద ర్శించి ప్రాజెక్టు నీటిని పరిశీలించారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లను చేర్చేందుకు చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకు న్నారు.
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) లక్ష్యం చేరడం లేదు. సీఎంఆర్ విధించిన గడువు ఈనెల చివరికల్ల్లా ముగియనుంది. కానీ జిల్లాలో ఇంకా చాలా మిల్లులు నిర్ధేశించిన లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఇటీవల పౌర సరఫరాల శాఖ హెచ్చరికలు చేస్తూ ఆయా యాజమాన్యాలకు నోటీసులు సైతం జారీ చేసింది. గత వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం అప్పగించాల్సిందేనని అందులో పేర్కొంది.
చలో గజ్వేల్‌కు పిలుపునిచ్చిన బీజేపీ నేతలను కామారెడ్డి పోలీసులు గురువారం రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటరమణారెడ్డితో పాటు మరో నలుగురు ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని బాన్సువాడ డివిజన్ పోలీసుస్టేషన్లకు తరలించారు. దీంతో కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆసుపత్రికి చేరే వరకు.. పుట్టిన బిడ్డ నుంచి రెండేళ్లలోపు చిన్నారుల వరకు టీకాలు వేయించడం.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు.. క్షయ బాధితులను గుర్తించి వారికి తగిన వైద్యం అందించే దిశగా కృషి చేయడం.. ప్రాణాంతకమైన కరోనా వైరస్ బాధితుల వివరాలను, క్షయ బాధితుల, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం, వారికి తగిన వైద్యసేవలు అందేలా చూడడం ఇలా ఒక్కటేమిటీ వైద్యఆరోగ్యశాఖ నిర్వహించే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఆశా కార్యకర్తలే. ఎన్నికలు, ఇంటింటి సర్వేలు నిర్వహించడంతో పాటు టీకాలు, వ్యాక్సిన్లు, ఐసీడీఎస్‌లో వారి సేవలు తప్పని సరి. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతీ పథకంలో వారి భాగస్వామ్యం ఉంటుంది.
సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో చేనేత పరిశ్రమ బలోపేతం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పినది చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.
అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరనేది తేలింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లు ఎవరిని వరించనున్నాయో మరికొన్ని రోజుల్లో తేలనుంది. టికెట్లకై కాంగ్రెస్ పెద్దలు స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సుమారు 21 మందికి పైగా కాంగ్రెస్ ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.