Home » Telangana » Nizamabad
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో పాడి పశువుల సంతతి పెంచడంతో పాటు, పాల సేకరణ అభివృద్ధి చేసేందుకు గాను 2001 సంవత్సరంలో పశుగణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థకు చైర్మన్‌ను నియమించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా గోపాలమిత్రలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 130మంది గోపాలమిత్రలను నియమించారు. దీని ద్వారా నియామకం అయిన గోపాలమిత్రలు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ మేలు రకం జాతి దూడలను ఉత్పత్తి చేసేందుకు కృత్రిమ గర్భధారణ కోసం వీర్యాన్ని (సిమన్స్) ఇంజక్షన్ ద్వారా గేదేకు వేస్తారు. దీంతో గ్రామాల్లో మేలు జాతి రకం గేదెలు పెరగడంతో పాటు పాల సేకరణ పెరుగుతోంది.
బాన్సువాడ మున్సిపాలిటీ పరిఽధిలోని కల్కి చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న మల్టీ జనరేషన్ పార్క్ పనులను గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. అదేవిధంగా నిజాంసాగర్ మండల ప్రజా ప్రతినిధులతో కలిసి మినీట్యాంక్ బండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ బాన్సువాడలో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దఫేదార్ రాజు, నిజాంసాగర్ మండల ప్రజా ప్రతినిధులు, బాన్సువాడ నాయకులు, తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ ఎంపీ, బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ వి.హన్మంత్‌రావు అన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చని జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు వచ్చే ఎన్నికల్లో అధిక సీట్లు దక్కాలంటే బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రజల పేగుబంధంతో కూడిన పార్టీ అని, ప్రతిపక్షాలది ఓటుబంధంతో కూడిన పార్టీలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్ పట్ట ణంలో బుధవారం నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల కార్యకర్తల సమావేశం శక్కర్‌నగర్ మైదానంలో నిర్వహించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు చందమామ తీసుకొచ్చి మీ వొళ్లో పెడతామని మాయమాటలు చెబుతున్నారని వారి అబద్ధపు హామీల మాయలో పడొద్దని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
ఉమ్మడి జిల్లాలో బీసీ నేతలు వచ్చే ఎన్నికలు సన్నద్ధమవుతున్నారు. ఈ దఫా తాము ఉన్న పార్టీల నుంచి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం వచ్చే ఎన్నికల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ఈనెల 27, 28, సెప్టెంబరు 2, 3 తేదీల్లో ప్రతీ బూత్ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని యువత, ఓటర్లు వినియోగిం చుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ రాజకీయ ప్రతినిధులకు సూచించారు. సెకండ్ సమ్మరి రివిజన్‌పై బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
కామారెడ్డి జిల్లాలో తుపాకుల పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలో గన్‌కల్చర్ పెరిగిపోతోంది. ఏదో ఒక చోట తుపాకులు వినియోగిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. సరదా కోసం కొందరు ఎయిర్గన్లను ఉపయోగిస్తుండగా అవి ప్రాణాల మీదకు తీసుకువస్తున్నాయి. మరికొందరు ఆత్మరక్షణకు గన్ లైసెన్స్ తీసుకుంటున్నప్పటికీ వాటిని దుర్వినియోగానికి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి జిల్లాలో భారీగానే దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డిలోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. కానీ నియోజకవర్గానికి ఇచ్చేది మూడు వేల ఇళ్లు మాత్రమే ఈ లెక్కన జిల్లాలో 10వేల 500ల మందికి గృహయోగం కలుగనుంది.
హైదరాబాద్‌లో ప్రతీ కులానికి ఆత్మగౌరవ భవనం కట్టామని తెలిపారు. అలాగే ప్రతీ మతానికి సంబంధించిన పండుగలు ఘనంగా చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ప్రతీ ఇంటికి పథకం వచ్చిందని చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌లో ఐటీ హబ్ పెట్టి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్నామని తెలిపారు.