Home » Telangana » Nizamabad
జిల్లాలో ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నాలుగు నెలల్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు లేని ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధమయ్యేలా అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది.
చిన్న పిల్లల్లో పౌష్టికాహారం, రక్తహీనతకు కారణమయ్యే నులిపురుగులను నివారించేందుకు గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నులిపురుగుల నివారణలో భాగంగా చిన్నారులకు అల్బెండాజోల్ మాత్రలను ఇవ్వనున్నారు.
జిల్లావ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేకుండా ముసురుతో కూడిన వర్షం కురుస్తునే ఉంది. ఎడతెరపులేని వర్షంతో జిల్లా తడిసిముద్దయింది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా పెద్ద వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతుండడం, వరినాట్లు వేసేందుకు సాగునీరు లేకపోవడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతూ వచ్చారు.
మహిళలు వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా పరిపుష్టిని సాధించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని రోటరీక్లబ్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఽధ్వర్యంలో మహిళా మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే 30 ఏళ్లలో పెరగనున్న జనాభాను అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా తాగునీటి ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు రూపొందించింది.
జగిత్యాల: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఉచ్చు బిగిస్తున్నామని తెలిపారు.
వెనుకబడిన తరగతుల కుల వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తుల విచారణ కొనసాగుతునే ఉంది. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి ఆర్థిక స్థితిగతులపై అధికారులు ఆరా తీస్తున్నారు.
కార్పోరేట్ స్థాయిలో బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అథితిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మండల ప్రజాపరిషత్ వైస్ ఎంపీపీలకు అవిశ్వాస గండం తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రప్రథమంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే వైస్ ఎంపీపీలపై అధికార బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వైరల్ జ్వరాలతో రోజురోజుకూ జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజలు శ్రద్ధ చూపకపోవడం వల్లనో లేదా క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్లనో దోమలు పెరిగిపోయి మలేరియా, డెంగ్యు వంటి జ్వరాలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.