Home » Telangana
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకుడు యాదగిరి డిమాండ్ చేశారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ యో గేష్గౌతమ్ అన్నారు.
పేట జిల్లాలోని పాఠశాలలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలను శనివారం పలువురు అధికారులు తనిఖీ చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
పేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం మైదానంలో శనివారం దివ్యాంగుల క్రీడా పోటీలు జరిగాయి.
గ్రామంలోనే ఉంటూ గ్రామంలో క్షేత్ర స్థాయి అధ్యయనానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవన రుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న ఐఏఎస్లు శని వారం జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి వచ్చారు.
రద్దీ ఉన్న రూట్లలో ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణి కులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. చెన్నూరు రూట్లో ఆదాయం ఉన్నా.... బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.
దివ్యాంగుల హక్కుల సాధన కోసం శనివారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళ లో ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు.
నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా ఎమ్మెల్యే గడ్డం వినోద్ పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి స్ధానికంగా అందుబాటులో ఉంటానని దైవసాక్షిగా ప్రమాణం చేసి గెలిచిన తర్వాత హైద్రాబాద్కే పరిమితమయ్యాడని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలలో రెక్కాడితే కానీ డొక్కాడని కూలీ కుటుంబాలు కోకొల్లలుగా ఉంటాయి.