Home » Telangana » Warangal
గ్రామ కార్యదర్శులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమయానికి నిధులు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గ్రామ పంచాయతీలలో నిధులు లేక పంచాయతీ కార్యదర్శులే అయిదు నెలలుగా ట్రాక్టర్ డీజిల్‌తో పాటు ఇతరత్రా మరమ్మతుల కోసం సొంత డబ్బులను వెచ్చిస్తున్నారు. దీనికి తోడు అధికారులు అప్పగిస్తున్న పలు సర్వేలతో ఇబ్బందులు పడుతున్నారు.
భారతదేశం బహుళ సంస్కృతులు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. భారతదేశంలోని రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయి. శతాబ్దాల క్రితం వివిధ రాష్ట్రాలను పాలించిన ఆయా రాజులు.. తమ పాలనలో వివిధ కట్టడాలు నిర్మించి భావి తరాలకు అందించారు. అందులో ఆధ్యాత్మికంగా కట్టిన వివిధ ఆలయాలే ఎక్కువగా ఉంటాయి. కరోనా తర్వాత దేశంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడెక్కడ మంచి ప్రదేశాలు ఉన్నాయో వెతుకుతూ గూగుల్‌ను జల్లెడ పట్టేస్తున్నారు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్రం ఒక మంచి గమ్యం. అందులోనూ ముఖ్యంగా వరంగల్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు ఒక చక్కని అనుభూతిని ఇస్తాయి.
నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అవాక్కయ్యారు. పురుగులు పట్టిన కిరాణా సరకులు, కళ్లిపోయిన మాంసం, మళ్లీ మళ్లీ వాడే వంట నూనె చూసి షాకయ్యారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, స్ట్రీట్ ఫుడ్ ద్వారా ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హనుమకొండలోని థౌజండ్ పిల్లర్స్ హోటల్ సహా పలు పేరుపొందిన హోటళ్లల్లో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ప్రధాన ఉద్ధేశంతో ఆయిల్‌పాం తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహి స్తోంది. సాగుకు తక్కువ మొత్తంలో ఖర్చు కావడం, ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుండడం, తెగుళ్ల బెడద పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో రైతులు ఆయిల్‌పాం సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పలుచోట్ల రైతులు అంతర పంటలను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ప్రభుత్వం ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తుండడంతో రైతులు సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే... మారుమూల గ్రామాల ప్రజలకు ప్రళయమే. జల దిగ్బంధనంలో చిక్కుకొని విలవిలలాడాల్సిందే. వరద చుట్టుముట్టి నిండా ముంచేస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమనాల్సిందే. ఇల్లూ వాకిలి ఆగ మై... ఎటు వెళ్లాలన్నా దారి దొరక్క వారు పెట్టే ఆక్రం దనలు మిన్నంటుతుంటాయి.
హనుమకొండ: బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ బాస్కర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ విపక్షంపపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ..
పేద, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల సాకారమయ్యేలా లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తుందనే ఆశతో ‘గృహలక్ష్మి’ పథకంలో భాగం గా గృహనిర్మాణాన్ని చేపట్టగా.. ఈ స్కీమ్‌ను ఇప్పటి కాం గ్రెస్ సర్కారు రద్దు చేసింది. దీంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పథకం మంజూరైందన్న ఆశ తో ఉన్నఇల్లును తొలగించుకొని, నిర్మాణం చేపట్టగా అర్థాంతరంగా పథకం నిలిచిపోవడంతో లబ్ధిదారులు వీధినపడినట్లయింది.
పల్లెల్లో ప్రత్యేకాధి కారుల పాలన పడకేసింది. ఒక్కో అధికారికి మూడు, నాలు గు పంచాయతీల బాధ్యతలను అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్థంగా మారిపోయింది. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలు, చేతిపంపులు మరమ్మతులకు నోచుకోకపోవడం, పారిశుధ్యంపై పర్యవేక్షణ కొరవడడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు.
జిల్లా, మండల పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. మండల, జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ‘ప్రత్యేక’ పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. పరిషత్తులో ఇకపై పాలన బాధ్యతలను జిల్లా అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం జీవో జారీ చేసింది.
వన సంపద పెంచాలనే సంకల్పం ఆదిలోనే అంతమైంది. హరితహారం పేరుతో గత ప్రభుత్వం నాటి మొక్కలు ఎక్కడా కనిపంచడం లేదు. తొలి నుంచే ఈ కార్యక్రమం నిర్లక్ష్యానికి గురైంది. ఆరంభ శూరత్వంలా మొక్కలు నాటాలనే ఆతృత తప్ప.. వాటిని బతికించుకోవాలనే ఆలోచన లేకుండా పోయింది.