Bharat Jodo Yatra : రాహుల్‌తో కలిసి నడవడానికి కారణం అదే : కమల్ హాసన్

ABN , First Publish Date - 2022-12-24T17:57:17+05:30 IST

భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబరులో ప్రారంభమైంది. హర్యానాలోని

Bharat Jodo Yatra : రాహుల్‌తో కలిసి నడవడానికి కారణం అదే : కమల్ హాసన్
Kamal Hassan, Rahul Gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో తాను ఓ భారతీయుడిగా పాల్గొన్నానని ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Hassan) చెప్పారు. ఈ యాత్రలో ఎందుకు పాల్గొన్నారని తనను చాలా మంది అడుగుతున్నారన్నారు. తన తండ్రి కాంగ్రెస్‌వాది అని, తనకు రకరకాల భావజాలాలు ఉన్నాయని చెప్పారు. తాను సొంతంగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశానని, అయితే దేశం విషయానికి వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీల రేఖలు మసకబారిపోవాలన్నారు. ఆ రేఖను తాను మసకబార్చి, ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఈ యాత్ర ఢిల్లీలోని ఎర్ర కోట వద్దకు చేరుకున్న తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబరులో ప్రారంభమైంది. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి శనివారం ఉదయం ఢిల్లీలో ప్రవేశించిన సందర్భంగా ఈ యాత్రలో పాల్గొన్నవారిలో కాంగ్రెస్ (Congress) పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra), జైరామ్ రమేశ్, పవన్ ఖేరా, భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణదీప్ సుర్జీవాలా, రాబర్ట్ వాద్రా, వాద్రా దంపతుల పిల్లలు ఉన్నారు.

రాహుల్ గాంధీ (Rahul Gandhi) కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ వరకు ఆయనతో కలిసి నడిచారు. కర్ణాటకలోని మాండ్యలో కూడా సోనియా గాంధీ (Sonia Gandhi) ఈ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ ఇచ్చిన ట్వీట్‌లో, తాను తన తల్లి నుంచి పొందిన ప్రేమను దేశానికి పంచుతున్నానని తెలిపారు. తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

ఇప్పటి వరకు సుమారు 3,000 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర సాగింది. దాదాపు మరో 570 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, జమ్మూ-కశ్మీరులో ముగిస్తారు.

Updated Date - 2022-12-24T17:57:25+05:30 IST