Share News

Purandeswari: ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తే టీడీపీ కోవర్ట్ అంటారా?

ABN , First Publish Date - 2023-11-06T17:04:55+05:30 IST

అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు.

Purandeswari: ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తే టీడీపీ కోవర్ట్ అంటారా?

అనంతపురం: అవినీతి మరక లేని పార్టీ బీజేపీ పార్టీనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోంది. నిరుపేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 18 లక్షల ఇల్లు కేటాయిస్తే ఎన్ని ఇళ్లులు నిర్మించారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కరవు జిల్లాలైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రభుత్వం చెరువులకు నీరు ఇస్తామని చెప్పి అందించలేకపోయారు. అభివృద్ధికి బీజేపీ పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. మా ప్రభుత్వం కేటాయించిన నిధులకు స్టిక్కర్లు వేసుకుని వైసీపీ పరిపాలన కొనసాగిస్తోంది.’’ అని విమర్శించారు.

‘‘అధికార వైసీపీ ప్రభుత్వం పరిపాలనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా?, విధానపరమైన లోపాలను ఎత్తి చూపిస్తే టీడీపీ కోవర్ట్ అంటే ఎలా?, ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ- జనసేన పార్టీలు పొత్తులో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 175 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఫిర్యాదు చేశాం. అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు. అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ భారతీయ జనతా పార్టీ.’’ అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-11-06T17:06:39+05:30 IST