New Party in AP.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఎవరు చేశారంటే..!
ABN , First Publish Date - 2023-02-10T13:14:20+05:30 IST
ఏపీలో ఇప్పటి వరకూ ముఖ్యంగా వైసీపీ, టీడీపీలే కనిపిస్తున్నాయి. బీజేపీ ఉన్నా కూడా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటే మాత్రమే ఎక్కువగా ఫోకస్‌లోఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనతోనే మరుగున పడిపోయింది. ఏపీలో ఆ పార్టీ ప్రభావం అసలు లేదనే చెప్పాలి. ఇక జనసేన..
అమరావతి : ఏపీలో ఇప్పటి వరకూ ముఖ్యంగా వైసీపీ (YCP), టీడీపీ (TDP)లే కనిపిస్తున్నాయి. బీజేపీ (BJP) ఉన్నా కూడా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటే మాత్రమే ఎక్కువగా ఫోకస్‌లోఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ (Congress Party) రాష్ట్ర విభజనతోనే మరుగున పడిపోయింది. ఏపీ (AP)లో ఆ పార్టీ ప్రభావం అసలు లేదనే చెప్పాలి. ఇక జనసేన (Janasena).. ఇటీవలి కాలంలో బాగా పుంజుకుంది. కానీ సింగిల్‌గా పోటీ చేస్తే ఓట్లు చీల్చడం తప్ప ఇప్పటికిప్పుడు అయితే అధికారంలోకి రాలేదు. ఇప్పటి వరకూ అయితే చెప్పుకోదగినవి ఇవే. ఇక మున్ముందు మరో పార్టీ రాబోతోంది. అనౌన్స్‌మెంట్ కూడా అయిపోయింది. మరి అది ఏం పార్టీ? ఆ అనౌన్స్‌మెంట్ ఎవరు చేశారు?
త్వరలో ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయ బోతున్నట్లు మాజీ ఐఏఎస్ అధికారి వి.జి.ఆర్ నారగోని (VGR Naragoni), బీసీ నాయకులు అన్నా రామచంద్ర యాదవ్ (Anna Ramachandra Yadav) నేడు ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పార్టీ లోకి రానున్నారని వెల్లడించారు. బహుజనుల హక్కుల కోసం తాము నూతనంగా స్థాపించబోయే పార్టీ పని చేస్తుందని వెల్లడించారు. బీసీల నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఐక్యం చేస్తామన్నారు. వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంక్‌గా ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని నేతలు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణ కోసం నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం ఒకే పార్టీ.. ఒకే జెండా ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ, టీడీపీలు బీసీలకు అన్యాయం చేశాయన్నారు. త్వరలో భారీ సభ జరిపి నూతన పార్టీ పేరు, జెండా ప్రకటిస్తామన్నారు. నూతన పార్టీ కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేస్తామని నారగోని, రామచంద్ర యాదవ్ వెల్లడించారు.