TDP: ఎక్కడ తప్పు జరిగినా ఆ లీడర్‌ని పార్టీ నుంచి తొలగిస్తాం: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2023-03-08T16:04:00+05:30 IST

వైసీపీ (YCP) ప్రభుత్వంపై టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Acham Naidu) ధ్వజమెత్తారు.

TDP: ఎక్కడ తప్పు జరిగినా ఆ లీడర్‌ని పార్టీ నుంచి తొలగిస్తాం: అచ్చెన్నాయుడు

తిరుపతి: వైసీపీ (YCP) ప్రభుత్వంపై టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Acham Naidu) ధ్వజమెత్తారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రాన్ని దొంగ ఓట్ల క్షేత్రంగా జగన్ (CM Jagan) మార్చేశాడని మండిపడ్డారు. ఎన్నికలు అయిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు అక్రమాలను ఆధారాలతో తేలుస్తామన్నారు. ‘‘ఫోర్జరీ చేసి డిగ్రీ సర్టిఫికెట్ సృష్టించిన వారు, ఆ సృష్టించిన వాటికి అటే స్టేషన్ చేసిన వారు, దొంగ ఓట్లు చేర్పించిన వారు, దొంగ ఓటు వేసినవారందరిని జైలుకు పంపుతాం’’ అని హెచ్చరించారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రణాళికలో కూడా టీడీపీ కొత్త పోకడకు శ్రీకారం చుట్టు పోతుందన్నారు. ప్రతి బూత్‌కి సీనియర్ లీడర్ ఇన్చార్జిగా నియమిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడ తప్పు జరిగినా ఆ లీడర్‌ని తెలుగుదేశం పార్టీ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కావాలి కాబట్టే ఉద్యోగ సంఘాలను మళ్లీ మోసం చేస్తున్నాడని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు మోసపోవద్దని సూచించారు.

Updated Date - 2023-03-08T16:04:00+05:30 IST