Congress: బీజేపీకి సరికొత్త నామకరణం చేసిన ఏపీ పీసీసీ చీఫ్

ABN , First Publish Date - 2023-06-22T16:03:04+05:30 IST

బీజేపీ పార్టీకి ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సరికొత్త నామకరణం చేశారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని ‘‘బాబు, జగన్, పవన్’’ పార్టీ అంటూ యెద్దేవా చేశారు. రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయమన్నారు. 2014 నుంచి 2024 మధ్యలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు ఆలోచించాలన్నారు. వైసీపీ, టీడీపీ ప్రాంతీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాలతో వ్యవహరిస్తున్నాయన్నారు.

Congress: బీజేపీకి సరికొత్త నామకరణం చేసిన ఏపీ పీసీసీ చీఫ్

చిత్తూరు: బీజేపీ పార్టీకి ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు (AP PCC Chief Gidugu Rudraraju) సరికొత్త నామకరణం చేశారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని ‘‘బాబు, జగన్, పవన్’’ పార్టీ అంటూ యెద్దేవా చేశారు. రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయమన్నారు. 2014 నుంచి 2024 మధ్యలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు ఆలోచించాలన్నారు. వైసీపీ (YCP), టీడీపీ (TDP) ప్రాంతీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాలతో వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ చేతులెత్తేసిందని అన్నారు. రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలంటే పార్టీలతోనే సాధ్యమన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యలు చేశారు. అవకాశవాద రాజకీయాలను బీజేపీ నడిపిస్తోందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) వ్యవహారంలో బీజేపీ దొంగాట ఆడుతోందన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల పరిస్థితి తెలంగాణలోనూ ఎదురుకానుందని తెలిపారు. ఏపీలోనూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీయనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తోందని గిడుగు రుద్రరాజు విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-06-22T16:03:04+05:30 IST