AP NEWS: ఏఆర్ కానిస్టేబుల్ రెండో వివాహం.. న్యాయం చేయాలని మొదటి భార్య ఆందోళన
ABN , Publish Date - Dec 24 , 2023 | 09:30 PM
జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే గిరిబాబు యూనిఫామ్‌తోనే గుడిలో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయం మొదటి భార్య విజయకుమారికి తెలియడంతో ఆమె భర్త ఉంటున్న ఇంటి ముందు నిరసనకు దిగింది. తాను ఉండగానే నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తనకు న్యాయం చేయాలని విజయకుమారి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టింది.
చిత్తూరు: జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే గిరిబాబు యూనిఫామ్‌తోనే గుడిలో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయం మొదటి భార్య విజయకుమారికి తెలియడంతో ఆమె భర్త ఉంటున్న ఇంటి ముందు నిరసనకు దిగింది. తాను ఉండగానే నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తనకు న్యాయం చేయాలని విజయకుమారి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే... పుంగనూరు మండలం కంగానెల్లూరు చెందిన గిరిబాబు ఆరేళ్ల ముందు విజయకుమారిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గిరిబాబుకు పుట్టింటి నుంచి 4 లక్షలు కట్నంగా మొదటి భార్య విజయకుమారి తీసుకువచ్చింది. కొన్నాళ్లు కాపురం సజావుగానే సాగింది.
భర్త గిరిబాబుకు 2020లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం రావడంతో అప్పటి నుంచి విజయకుమారితో భర్త తరచూ గొడవకు దిగుతున్నాడు. ఇదిలా ఉండగా.. రెండేళ్లుగా వేరే అమ్మాయితో ఏఆర్ కానిస్టేబుల్ గిరిబాబు ప్రేమ వ్యవహారం గుట్టుచప్పుడుగా నడుపుతున్నాడు. ఈ మధ్యనే ఆ అమ్మాయిని కానిస్టేబుల్ గిరిబాబు పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్య విజయకుమారి తనకు న్యాయం చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నిరసన చేపట్టింది. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి భర్త గిరిబాబుపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.