Lokesh YuvaGalam: 34వ రోజు లోకేష్ పాదయాత్ర.. ఇంతవరకు ఎన్ని కి.మీ నడిచారో తెలుసా..

ABN , First Publish Date - 2023-03-04T10:26:06+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.

Lokesh YuvaGalam: 34వ రోజు లోకేష్ పాదయాత్ర.. ఇంతవరకు ఎన్ని కి.మీ నడిచారో తెలుసా..

తిరుపతి: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేష్‌ పాదయాత్ర (Lokesh Padayatra) కు టీడీపీ అభిమానులు, మహిళలు, ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్‌ (Nara Lokesh) కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ.. తమ అభిమాన నేతతో సెల్ఫీలు దిగుతున్నారు. పాదయాత్ర చేస్తూ లోకేష్ (YuvaGalam) ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను తీర్చుతామంటూ హామీ ఇస్తున్నారు.

అలాగే వైసీపీ (YCP) పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్, వైసీపీ నేతల ఆగడాలకు అడ్డేలేకుండా పోతోందంటూ లోకేష్ విరుచుకుపడుతున్నారు. అలాగే ప్రతీ రోజు వెయ్యిమందితో సెల్పీలు దిగుతూ పాదయాత్రకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. జనవరి 27న యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam) ప్రారంభమవగా.. ఇప్పటి వరకు లోకేష్ (YuvaGalam Padayatra) 437 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈరోజు 34వ రోజు పుంగనూరు నియోజకవర్గం కొక్కువారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర చేపట్టారు. నేడు దాదాపు 14.2 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్రగా నడవనున్నారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదే...

ఉదయం

10:00 – దేవళంపేటలో స్థానికులతో మాటామంతీ.

10:35 – తుడుంవారిపల్లిలో బిసి సామాజికవర్గీయులతో భేటీ.

11:30 - కల్లూరులో యువతీయువకులతో ముఖాముఖి.

12:30 – కల్లూరులో భోజన విరామం.

సాయంత్రం

2:30 – కల్లూరులో ముస్లింలతో సమావేశం.

3:30 – కల్లూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

3:35 – కల్లూరు సర్కిల్ లో హామాలీలతో మాటామంతీ.

6:00 – జ్యోతినగర్ విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-03-04T10:26:06+05:30 IST