Gudivada Amarnath: చంద్రబాబు అంటే ఏంటో ప్రజలకు తెలుసు... ఎన్ని చేసినా నమ్మరు..

ABN , First Publish Date - 2023-05-31T12:36:01+05:30 IST

మ్యానిఫెస్టో అనే దానికి చంద్రబాబుకు పెద్దగా అర్ధం తెలియదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బుధవారం తిరుమల శ్రీవారిని మంత్రి‌ దర్శించుకున్నారు.

Gudivada Amarnath: చంద్రబాబు అంటే ఏంటో ప్రజలకు తెలుసు... ఎన్ని చేసినా నమ్మరు..

తిరుమల: మ్యానిఫెస్టో అనే దానికి చంద్రబాబుకు (TDP Chief Chandrababu Naidu) పెద్దగా అర్ధం తెలియదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Minister Gudivada Amarnath) అన్నారు. బుధవారం తిరుమల శ్రీవారిని (Tirumala Sirvari Temple) మంత్రి‌ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కొత్తగా పార్టి పెట్టి.. కొత్త మ్యానిఫేస్టో పెడితే బహుశా ప్రజలు నమ్మెవారేమో అని అన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన వ్యక్తిగా రాష్ట్ర ప్రజలందరికి చంద్రబాబు అంటే ఏంటో తెలుసన్నారు. ఐదు కేజీల బంగారు, పది‌కేజీల వెండి, ఇంటికొక బెంజ్ కారు ఇస్తానంటే కూడా చంద్రబాబుని ప్రజలు నమ్మరని అన్నారు. పొత్తులతో తప్ప తాను నేరుగా రాజకీయం చేయలేను అని.. పార్టీని నడపలేనని పవన్ కళ్యాణే చెప్పారని తెలిపారు. దొంగల ముఠా వ్యవహారాన్ని ప్రజలకు తెలిసేలా మరింత ముందుకు తీసుకెళ్తామని మంత్రి చెప్పారు.

కొడాలి నాని కావాలని మాట్లాడలేదు...

మాజీ మంత్రి కొడాలి నానిపై (Kodali Nani) సోషల్ మీడియా పెట్టిన పోస్టులపై తాను సమాధానం చెప్పనని అన్నారు. కొడాలి‌ నాని కావాలని మాట్లాడిన మాటలు కాదని చెప్పారు. విశాఖపట్నంకు ఇన్ఫోసిస్ వస్తుందంటే అది ఎవరి వల్లో లోకేష్‌కు (TDP Leader Nara lokesh) తెలియదా అని ప్రశ్నించారు. అనేక పరిశ్రమలు ఏపీలో ఉన్నాయన్నారు. ప్రజల్లో గెలువలేని వ్యక్తి.. ప్రజల్లో కనీసం పలుకుబడి లేని లోకేష్‌కు తమను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు.

త్వరలో పది ఫిషింగ్ హార్బర్‌లు ప్రారంభం..

గతేడాది‌ ఏపీ‌ సీఎం‌ జగన్ మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రారంభించిన రామాయపట్నం పోర్ట్ పనులపై సమీక్ష జరిపినట్లు తెలిపారు. ఈ‌ ఏడాది డిసెంబరు ‌నాటికి రామాయపట్నం పోర్ట్ మొదటి దశ‌ పనులు పూర్తి చేస్తామన్నారు. ఏపీలో పారిశ్రామికపరంగా అభివృద్ధి.. పోర్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో దాదాపు పది ఫిషింగ్ హార్బర్‌లను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం.. మిగిలిన పారిశ్రామిక నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో పదమూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరుగుతున్నాయని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-31T12:36:01+05:30 IST