Share News

Nara Bhuvaneshwari: పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనం

ABN , First Publish Date - 2023-10-21T16:44:38+05:30 IST

పుంగనూరు ఘటన పై ట్విట్టర్ ద్వారా నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) స్పందించారు. ‘

Nara Bhuvaneshwari: పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనం

చిత్తూరు: పుంగనూరు ఘటన పై ట్విట్టర్ ద్వారా నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) స్పందించారు. ‘‘పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనం. పుంగనూరులో శ్రీకాకుళం వాసులను చొక్కాలిప్పించిన ఘటన చూసి నేను షాక్‌కు గురయ్యాను. ప్రజలందరినీ ఈ ఘటన నివ్వెరపరిచింది. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనం. 30 ఏళ్ల క్రితం బీహార్‌లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవు. పేదలపై పెత్తందారీ పోకడలు అంటే ఇవే! తెలుగుదేశం అంటే ఒక కుటుంబం. తండ్రి లాంటి తమ నేతను అక్రమంగా జైల్లో పెడితే బిడ్డలైన కార్యకర్తలు సైకిల్ యాత్ర చేసుకునే హక్కు కూడా లేదా? నడిరోడ్డుపై అసభ్యంగా సామాన్యులకు మీరు చేసిన అవమానం ప్రజలంతా గమనించారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు.... అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే’’ అని నారా భువనేశ్వరి తెలిపారు.

Updated Date - 2023-10-21T16:44:38+05:30 IST