Nara Lokesh: జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ నారా లోకేష్
ABN , First Publish Date - 2023-02-16T23:08:08+05:30 IST
వైసీపీ (YCP) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చిత్తూరు: వైసీపీ (YCP) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ యువకులు, మహిళలు, రైతులతో మాట్లాడారు. 21వ రోజున 17.2 రెండు కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు లోకేష్ 278.5 కిలోమీటర్లు నడిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు ఎవరినోట విన్నా లోకేష్ మాటే వినిపిస్తోంది. ఆయన పాదయాత్ర 21వ రోజున విజయవంతంగా సాగింది. ప్రతిరోజు ఉదయం 1000 మందికి లోకేష్ సెల్ఫీలు ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో గురువారం రోజు రాయిపేడు విడిది కేంద్రంలో యువకులకు సెల్ఫీలు ఇచ్చారు.
యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీలు ఇవ్వడంతో జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక హలో లోకేష్ కార్యక్రమంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గంలో యువతతో లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. జగన్ నమ్మించి మోసగించారని యువకులు వాపోయారు. జాబ్ క్యాలెండర్ అంటే నమ్మి ఓటేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు చదువుకుంటుంటే టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయలేదని యువత గుర్తు చేసింది. డిగ్రీ చదవాలంటే రోజూ నగరి వెళ్లాల్సి వందని యువకులు లోకేష్‌కు చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మారిందని లోకేష్ విమర్శించారు. డీఎస్సీ ద్వారా టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామన్న జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని లోకేష్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
***************************************
తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఇంప్లీడ్ పిటిషన్
************************************************
రౌడీరాజ్యం పోవాలి.. రామరాజ్యం రావాలి !
*********************************