Narayana Swamy: ఏపీలో కల్తీ మద్యం ఉందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
ABN , First Publish Date - 2023-09-28T18:59:25+05:30 IST
పీలో కల్తీ మద్యం ఉందని ఆధారాలతో సహా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Narayana Swamy) వ్యాఖ్యానించారు.
చిత్తూరు: ఏపీలో కల్తీ మద్యం ఉందని ఆధారాలతో సహా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి(Narayana Swamy) వ్యాఖ్యానించారు. గురువారం నాడు రీజనల్ ఎక్స్చెంజ్ & ప్రొహిబిషన్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తండ్రి ఫొటో పెట్టుకుని లోకేష్ ఒక్క సీటు గెలిచిన ఆయననే సీఎం చేస్తాం. రామరావు ఫొటో లేకుండా లోకేష్, బాబు ఎన్నికలకు వెళ్లగలరా.అవినీతిని అంతం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడు జైలుకెళ్లి చంద్రబాబును ఎందుకు కలిశారు. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలా....మద్యం షాపులు ఆడిటరా... చంద్రబాబు అవినీతి చక్రవర్తి.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, ఓటుకు నోటు అక్రమాలు, అవినీతి కాదా..? తండ్రి మరణానికి కారణమైన చంద్రబాబును పురంధేశ్వరి ఎందుకు సమర్థిస్తోంది’’ అని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.