Ramachandra Yadav: పెద్దిరెడ్డికి అనుకూలంగా పోలీసు వ్యవస్థ
ABN , First Publish Date - 2023-08-23T17:13:37+05:30 IST
ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయించడానికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)కి అనుకూలంగా పోలీసు వ్యవస్థ(Police System) మారిందని బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav ) అన్నారు.
చిత్తూరు: ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయించడానికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)కి అనుకూలంగా పోలీసు వ్యవస్థ(Police System) మారిందని బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav ) అన్నారు. బుధవారం నాడు పుంగనూరు ఘటన(Punganur incident)ల్లో అక్రమ కేసుల్లో జైలుకెళ్లి చిత్తూరు సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ నేతలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి మంత్రి పెద్దిరెడ్డికి తొత్తుగా మారారని మండిపడ్డారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక, మైనింగ్, ఎర్రచందనం, భూ కబ్జా మాఫియాలను అరికట్టలేని పోలీసులు ప్రతిపక్షంపై మాత్రం అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. రాజకీయ నాయకులు శాశ్వతం కాదు అధికారులు మాత్రమే శాశ్వతం అని చెప్పారు. తప్పు చేస్తున్న అధికారులు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రామచంద్ర యాదవ్ హెచ్చరించారు.