Lokesh YuvaGalam: 36వ రోజుకు లోకేష్ పాదయాత్ర... నేటి పాదయాత్ర వివరాలు

ABN , First Publish Date - 2023-03-06T09:45:22+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా 35రోజులు పూర్తి చేసుకుని నేడు 36వ రోజులో అడుగుపెట్టింది.

Lokesh YuvaGalam: 36వ రోజుకు లోకేష్ పాదయాత్ర... నేటి పాదయాత్ర వివరాలు

అన్నమయ్య: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Lokesh YuvaGalam Padayatra) విజయవంతంగా 35 రోజులు పూర్తి చేసుకుని నేడు 36వ రోజులో అడుగుపెట్టింది. ఈ 35 రోజుల్లో లోకేష్ (YuvaGalam) ఇప్పటి వరకు 458 కిలోమీటర్ల మేర పాదయాత్రగా నడిచారు. ఈరోజు పాదయాత్ర (YuvaGalam Padayatra) లో భాగంగా 10.4 కిలోమీటర్లు నడువనున్నారు. 36వ రోజు పీలేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో లోకేష్‌ (Lokesh YuvaGalam Padayatra) ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అనేక చోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చాక చేసే అభివృద్ధి పనులను తెలియజేస్తున్నారు. వైసీపీ (YCP) పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ నాయకత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెబుతున్నారు. ప్రజల సమస్యలు వింటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామంటూ లోకేష్ (NaraLokesh) హామీ ఇస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.

నేటి పాదయాత్ర వివరాలు...

ఉదయం

9:00 – పీలేరు శివారు వేపులబయలులో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి. విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

10:00 – వేపులబయలు నుంచి పాదయాత్ర ప్రారంభం.

11:00 – అంకాళమ్మతల్లి దేవాలయం వద్ద ఉప్పర, సగర సామాజికవర్గీయులతో మాటామంతీ.

12:30 – శివాపురం గ్రామంలో స్థానికులతో భేటీ.

1:05 – తిమ్మిరెడ్డిగారిపల్లిలో భోజన విరామం

సాయంత్రం

3:05 – తిమ్మిరెడ్డిగారిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4:20 – కొర్లకుంట పట్టికాడ గ్రామంలో స్థానికులతో మాటామంతీ.

4:50 – కలికిరి పంచాయితీ సత్యపురం వద్ద స్థానికులతో భేటీ.

5:15 – కలికిరిలో రైతులతో భేటీ.

5:30 – కలికిరి పంచాయితీ నగిరిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

6:20 – కలికిరి ఇందిరమ్మ కాలనీ వద్ద పార్టీలో చేరికలు.

6:30 – కలికిరి ఇందిరమ్మ కాలనీ వద్ద విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-03-06T09:45:22+05:30 IST