Yuvagalam పాదయాత్రపై టెన్షన్ టెన్షన్

ABN , First Publish Date - 2023-02-17T08:25:51+05:30 IST

శ్రీకాళహస్తిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పాదయాత్రపై టెన్షన్ చోటు చేసుకుంది. టీడీపీ నేతలు సూచించిన రూట్ మ్యాప్‌కు పోలీసులు నిరాకరించారు.

Yuvagalam పాదయాత్రపై టెన్షన్ టెన్షన్

తిరుపతి : శ్రీకాళహస్తి (Srikalahasti)లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్రపై టెన్షన్ చోటు చేసుకుంది. టీడీపీ నేతలు సూచించిన రూట్ మ్యాప్‌కు పోలీసులు నిరాకరించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున శ్రీకాళహస్తి పట్టణ చతుర్మాడా వీధుల్లోకి పాదయాత్రకు ప్రవేశం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. నిన్న విడిది చేసిన బైరాజు కండ్రిగ నుంచి తొట్టంబేడు మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. ఇక్కడి నుంచి కొత్త కండ్రిగ, రాజీవ్ నగర్ కాలనీ రామచంద్రపురం బంగారమ్మ కాలనీ మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వరకూ పాదయాత్ర జరగనుంది.

ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి పట్టణ చతుర్మాడా వీధుల గుండా పంచాయతీ రాజ్ అతిథిగృహం, బీపీ అగ్రహారం, పొన్నాలమ్మ గుడి మీదుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద ఏర్పాటుచేసిన బస ప్రదేశానికి యాత్ర చేరుకునేలా టీడీపీ నేతలు రూట్ మ్యాప్ రూపొందించారు. ఆ మేరకు పోలీసులకు ఎప్పుడో వివరాలను కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు తొలుత సూచించిన రూట్ మ్యాప్‌నకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి కొత్తపేట, తెట్టు, భాస్కర్ పేట వియ్యంపల్లి నుంచి నాయుడుపేట బైపాస్ మీదుగా ఏఎం పుత్తూరు నుంచి బీపీ అగ్రహారం పొన్నాలమ్మ గుడి నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బస ప్రదేశం వరకూ యాత్ర చేసుకోవాలని పోలీసులు సూచించారు.

Updated Date - 2023-02-17T08:29:00+05:30 IST