Gorantla Butchayya: ఆ విషయంలో నాదెండ్ల వెన్నుపోటును గుర్తుకు తెచ్చిన గోరంట్ల బుచ్చయ్య

ABN , First Publish Date - 2023-09-12T19:56:53+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla Bhaskar Rao) వెన్నుపోటు సమయంలో స్పందించిన విధంగా ప్రస్తుతం అందరూ స్పందించాలని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(MLA Gorantla Butchaiah) వ్యాఖ్యానించారు.చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrested)నేపథ్యంలో రాజమండ్రిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నాడు నిర్వహించారు.

Gorantla Butchayya: ఆ విషయంలో నాదెండ్ల వెన్నుపోటును గుర్తుకు తెచ్చిన గోరంట్ల బుచ్చయ్య

తూర్పుగోదావరి: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla Bhaskar Rao) వెన్నుపోటు సమయంలో స్పందించిన విధంగా ప్రస్తుతం అందరూ స్పందించాలని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(MLA Gorantla Butchaiah) వ్యాఖ్యానించారు.చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrested)నేపథ్యంలో రాజమండ్రిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించి, అమలు చేయాలని టీడీపీ నేతలు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య మాట్లాడుతూ.. టీడీపీ స్పీడ్‌ని బ్రేక్ చేయాలనే దురుద్దేశ్యంతో సైకో జగన్‌రెడ్డి నీతిమాలిన రాజకీయానికి తెరలేపారు. చంద్రబాబు అకర్రమ అరెస్టును కార్యకర్తలు జనాల్లోకి తీసుకువెళ్లాలని గోరంట్ల బుచ్చయ్య పేర్కొన్నారు.

జైలుకైనా వెళ్లడానికి సిద్ధం: జ్యోతుల నెహ్రూ

అనంతరం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ వివరాలను కరపత్రాలు ముద్రించి, ప్రతి ఇంటికి అందిస్తాం. కేవలం ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తే, జగన్‌కు బుద్ధి వస్తుంది. రెండో దశలో ప్రతీ గ్రామంలోనూ రిలే నిరాహార దీక్షలు చేపడతాం. అవసరం అయితే అందరూ కలిసి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉందామని జ్యోతుల నెహ్రూ తెలిపారు.

కుట్రలకు తెరలేపారు: వర్మ

లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు కార్యక్రమాలను జీర్ణించుకోలేక జగన్‌రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ మాట్లాడుతూ.. ఏపీలో జగన్‌రెడ్డి కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని వర్మ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-12T19:56:53+05:30 IST