NCBN ARREST: రాజమండ్రిలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొననున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

ABN , First Publish Date - 2023-09-16T15:05:28+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు(Illegal arrest of Nara Chandrababu Naidu)కు ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు.

NCBN ARREST: రాజమండ్రిలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొననున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

రాజమండ్రి : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు(Illegal arrest of Nara Chandrababu Naidu)కు ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు. పలు జిల్లాల్లో రోడ్లపైకి వచ్చి వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. రాజమండ్రిలోఈరోజు సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఆయనకు మద్దతు పలుకుతూ ఈ రోజు క్యాండిల్ ర్యాలీ(Candle Rally) నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ స్థానిక తిలక్‌ రోడ్డులోని సాయిబాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్‌ రామాలయం జంక్షన్‌ వరకూ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్‌ సతీమణి బ్రాహ్మిణి, మహిళలు భారీగా పాల్గొని క్యాండిల్ ర్యాలీ తీయనున్నారు.

Updated Date - 2023-09-16T15:05:28+05:30 IST