AP NEWS: పోలవరాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ: చినరాజప్ప
ABN , First Publish Date - 2023-08-07T21:26:38+05:30 IST
పోలవరం(Polavaram) విషయంలో తమ నిర్వాకం బయటకు వస్తుందనే జగన్ ప్రభుత్వం(Jagan govt) అందర్నీ అనుమతించడం లేదని టీడీపీ(TDP) ఎమ్మెల్యే నిమ్మకాయలచినరాజప్ప(Chinarajappa) అన్నారు.
ఏలూరు జిల్లా: పోలవరం(Polavaram) విషయంలో తమ నిర్వాకం బయటకు వస్తుందనే జగన్ ప్రభుత్వం(Jagan govt) అందర్నీ అనుమతించడం లేదని టీడీపీ(TDP) ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప(Chinarajappa) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టు అందర్నీ అనుమతించడం లేదు.15 మందికే అనుమతి ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును సర్వ నాశనం చేశారని ధ్వజమెత్తారు. పోలవరాన్ని నిషేధిత ప్రాంతంగా మార్చారు.టీడీపీ హయాంలో సామాన్య ప్రజలను సైతం బస్సుల్లో తీసుకెళ్లి పోలవరం నిర్మాణ పనులు చూపించాం. ప్రతిపక్ష నేతగా తొలిసారి పోలవరం వద్దకు చంద్రబాబు వచ్చారని చినరాజప్ప అన్నారు.