TDP: స్కిల్ కేసులో అనూహ్య మలుపు
ABN , First Publish Date - 2023-11-02T19:31:32+05:30 IST
స్కిల్ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. మొత్తం 12మంది ఐఏఎస్‌లను విచారించాలని సీఐడీకి టీడీపీ పార్టీ ఫిర్యాదు చేసింది.
అమరావతి: స్కిల్ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. మొత్తం 12మంది ఐఏఎస్‌లను విచారించాలని సీఐడీకి టీడీపీ పార్టీ ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని ఐఏఎస్ అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ సీఐడీకి టీడీపీ తరఫు న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అజయ్ కల్లంరెడ్డి, అజయ్‌జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మీ, ప్రేమ్ చంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతిక శుక్లా, అర్జా శ్రీకాంత్, జీ.జయలక్ష్మిలను విచారించాలని న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి, అప్పటి సీఎండీ బంగారు రాజులతో పాటు కార్పొరేషన్లోని సీఎఫ్ఓ, సీఈవో, ఈడీలను విచారించాలని న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదులో తెలిపారు. కాంట్రాక్ట్, చెక్ పవర్‌తో సంబంధం ఉన్న వివిధ స్థాయిల్లోని అధికారులను కూడా విచారించాలని సీఐడీకి టీడీపీ తరఫు న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు చేశారు.