Share News

Atchannaidu: ముర్షావలి సస్పెన్షన్ ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Dec 25 , 2023 | 08:16 PM

ముర్షావలి సస్పెన్షన్ ఆర్డర్‌ను ఉపసంహరించుకుని సమస్యకు మూలంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మడకశిర తహసీల్దార్ ముర్షావలి సస్పెన్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.

Atchannaidu: ముర్షావలి సస్పెన్షన్ ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలి

అమరావతి: ముర్షావలి సస్పెన్షన్ ఆర్డర్‌ను ఉపసంహరించుకుని సమస్యకు మూలంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మడకశిర తహసీల్దార్ ముర్షావలి సస్పెన్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ‘‘సత్యసాయి జిల్లా మడకశిర మండలం మడకశిర తహసీల్దార్‌ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడినందుకు సస్పెండ్ చేశారు. ఏ కారణంతో అయినా లంచం తీసుకోవడం సమర్థనీయం కాదు. అయితే ముర్షావలి లేవనెత్తిన సమస్యపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ముర్షావలి వివరించారు. ఈ ప్రభుత్వంలో వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయ్యాయో తద్వారా తెలుస్తోంది. వీడియో ద్వారా ముర్షావలి వెల్లడించిన సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టకుండా సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ చర్య చూస్తుంటే వ్యాధికి కాకుండా వ్యాధి లక్షణాలకు చికిత్స చేస్తున్నట్లుగా ఉంది. ముర్షావలి ప్రకటన ద్వారా పరిస్థితుల గురించి తెలుసుకొని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - Dec 25 , 2023 | 08:16 PM