Bopparaju: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలి
ABN , First Publish Date - 2023-12-10T16:52:13+05:30 IST
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ( Bopparaju Venkateswalu ) డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ నిర్వహించారు. ఈ సభకు బొప్పరాజు, సెక్రటరీ దామోదర్ హాజరయ్యారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత కోసం ఈ మహాసభని నిర్వహిస్తున్నారు.
విజయవాడ: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ( Bopparaju Venkateswalu ) డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ నిర్వహించారు. ఈ సభకు బొప్పరాజు, సెక్రటరీ దామోదర్ హాజరయ్యారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత కోసం ఈ మహాసభని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ...‘‘రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సిబ్బందికి వేతనాలు ఇవ్వాలి. పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ సంఘాలు అండగా ఉన్నాయి. ఆర్టీసీ, ఇరిగేషన్, గురుకులాల్లో చేసేవారిని ఆప్కాస్‌లోకి తీసుకోవాలి. పొరుగు సేవల సిబ్బందికి HR పాలసీ, మెడికల్ లీవులు ఇవ్వాలి. ఉద్యోగులకు సంక్షేమం కోసం ఏపీజేఏసీ పోరాడుతుంది’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.