Share News

Kumaraswamy : ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి సహాయ చర్యలను విస్తృతం చేయాలి

ABN , First Publish Date - 2023-12-04T20:17:58+05:30 IST

ఏపీలో మిచౌంగ్‌ తుఫాను ముంచుకు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి సహాయ చర్యలను విస్తృతం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ( Chigurupati Kumaraswamy ) తెలిపారు.

Kumaraswamy :  ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి సహాయ చర్యలను విస్తృతం చేయాలి

అమరావతి: ఏపీలో మిచౌంగ్‌ తుఫాను ముంచుకు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి సహాయ చర్యలను విస్తృతం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ( Chigurupati Kumaraswamy ) తెలిపారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తుపాను కారణంగా కోస్తా జిల్లాల్లో వరి, పత్తి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలి. ఒకవైపు కరువు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కనీస బాధ్యత లేకుండా రైతులను నిలువునా ముంచింది. ఇప్పుడు తుపాను విషయంలో ప్రభుత్వం తగు రీతిలో స్పందించకపోతే రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ధాన్యం కొనుగోలులో తేమ శాతం విషయంలో, రైసుమిల్లర్లు సేకరణ, నిల్వ విషయంలో ఆంక్షలు తొలగించాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తోంది’’ అని చిగురుపాటి కుమారస్వామి తెలిపారు.

Updated Date - 2023-12-04T20:18:57+05:30 IST