Dundi Rakesh : ఏపీలో పోలీసు వ్యవస్థ కనుమరుగు
ABN , Publish Date - Dec 16 , 2023 | 10:11 PM
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల నుంచి పోలీసు వ్యవస్థ కనుమరుగై పోయిందని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ ( Dundi Rakesh ) పేర్కొన్నారు.
అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల నుంచి పోలీసు వ్యవస్థ కనుమరుగై పోయిందని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ ( Dundi Rakesh ) పేర్కొన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మహిళలు, టీడీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. ధైర్యంగా ఎదుర్కోలేక పిరికితనంగా దాడులు చేస్తున్నారు. మా టీడీపీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి గూడవల్లి నరసయ్య ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. దాడి జరిగి ఒక రోజవుతున్నా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడిన వారిని వెంటనే పోలీసులు పట్టుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలి. పిరికి పనులు చేయటంలో జగన్ సిద్ధహస్తుడు.. పిల్లిలా ప్యాలెస్‌లో శాశ్వతంగా పాడుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’’ అని డూండి రాకేష్ హెచ్చరించారు.