High Court: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ABN , First Publish Date - 2023-11-16T22:54:02+05:30 IST
హైకోర్ట్ (High Court ) ఘాటు వ్యాఖ్యల దెబ్బకు ఏపీ ప్రభుత్వం ( AP Govt ) దిగి వచ్చింది. జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకుండా ప్రభుత్వం దాచేయడంతో ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్ట్‌లో పిటీషన్లు దాఖలయ్యాయి.
అమరావతి: హైకోర్ట్ (High Court ) ఘాటు వ్యాఖ్యల దెబ్బకు ఏపీ ప్రభుత్వం ( AP Govt ) దిగి వచ్చింది. జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకుండా ప్రభుత్వం దాచేయడంతో ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్ట్‌లో పిటీషన్లు దాఖలయ్యాయి. నిన్న న్యాయవాదులు ప్రస్తావించిన వెంటనే ధర్మాసనం జగన్ ప్రభుత్వంపై మండిపడింది. మరుసటి రోజే జీవోలపై GAD నోట్ విడుదల చేసింది. జీవోలు ఏపీ గెజిట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని జీఏడీ ఆదేశాలు ఇచ్చింది. కొన్ని విభాగాలు జీవోలు అప్‌లోడ్ చేయకపోవడంపై జీఏడీ అభ్యంతరం తెలిపింది. అన్ని జీవోలు అప్‌లోడ్ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. ఏపీ గెజిట్ వెబ్‌సైట్‌లో జీవోలు అప్‌లోడ్ చేయాలని గతంలోనే చెప్పామని జీఏడీ గుర్తుచేసింది. జీవోఎంఎస్, జీవోఆర్టీలను నిరంతరం అప్‌లోడ్ చేయాలని నోట్ విడుదల చేసింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి నేటి వరకున్న జీవోలు అప్‌లోడ్ చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవోలు అప్‌లోడ్ చేసి వాటి వివరాలు కేబినెట్ సెక్షన్ అధికారికి పంపాలని ఆదేశించింది. జీవోలు అప్‌లోడ్ చేయకపోతే ఇన్‌చార్జులను బాధ్యులను చేస్తామని జీఏడీ తెలిపింది. జీవోలు అప్‌లోడ్ చేయకపోవటాన్ని హైకోర్టు ఇటీవల తప్పుపట్టింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హడావిడిగా వివిధ శాఖలకు జీఏడీ నోట్ విడుదల చేసింది.