Nadendla Manohar: వైసీపీ పాలన చూస్తుంటే పరిస్థితులు అలానే అనిపిస్తున్నాయి

ABN , First Publish Date - 2023-02-28T12:17:58+05:30 IST

ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోంది? అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావం? ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా

Nadendla Manohar: వైసీపీ పాలన చూస్తుంటే పరిస్థితులు అలానే అనిపిస్తున్నాయి
వైసీపీ పాలన చూస్తుంటే...

అమరావతి: తెనాలి (Tenali)లో సీఎం జగన్ (CM JAGAN) పర్యటనపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. ‘‘ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెనాలి పర్యటన సందర్భంగా జనసేన (Janasena) పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోంది? అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావం? ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రికి భయం. అందుకే ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా... వచ్చినా పరదాల మాటున తిరిగే వ్యక్తికి భయం కాక మరేముంటుంది? ముఖ్యమంత్రి పర్యటన ముస్తాబుల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిపి రోగులను ఇబ్బందుల పాలు చేశారు. ఈ రోజు తెనాలి పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు. నాయకులను అరెస్టు చేయడం, ప్రజలను బయటకు రానీయకపోవడం, షాపులు మూయించడం... చూస్తుంటే రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారు అనిపిస్తోంది. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో భయానక వాతావరణం సృష్టించడమే వైసీపీ మార్కు పాలన (YCP Government). తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టరా? జగన్ రెడ్డి రోడ్డు మీద తిరగటం మర్చిపోయినట్లున్నారు. తన ప్యాలెస్ నుంచి తెనాలికి 28 కి.మీ. ఈ మాత్రం దూరం కూడా రోడ్డు ప్రయాణం చేయలేరా? తాడేపల్లి (Tadepalli) ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్‌లో వెళ్ళడం ఏమిటి? జనం నవ్వుకొంటున్నారు. జనం సొమ్ము జగన్ హెలీకాప్టర్ పర్యటనల పాలవుతోంది. హెలికాప్టర్ డబ్బులతో రోడ్లు బాగవుతాయి. రోడ్డు మీద వెళ్తే గుంతలు.. పాడైపోయిన రోడ్లు ఉంటాయని హెలికాప్టర్లో వెళ్తున్నారా?.’’ అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!

Updated Date - 2023-02-28T12:17:58+05:30 IST