Share News

K. Ravindra Kumar: సజ్జల కోర్టును అవమానిస్తున్నారు

ABN , First Publish Date - 2023-11-20T21:02:54+05:30 IST

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) కోర్టులను అవమానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ ( Kanakamedala Ravindra Kumar ) అన్నారు.

K. Ravindra Kumar: సజ్జల కోర్టును అవమానిస్తున్నారు

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) కోర్టులను అవమానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ ( Kanakamedala Ravindra Kumar ) అన్నారు. సోమవారం నాడు కనకమేడల నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఏపీ హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. స్కిల్ కేసు పెట్టిన రెండేళ్ల తర్వాత చంద్రబాబుపై కేసు పెట్టారు. కోర్టులో సాక్ష్యాలు చూపించలేదు. వైసీపీ నేతలకు న్యాయస్థానాల తీర్పును గౌరవించే సంస్కృతి లేదు. పైగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేస్తున్నారు. సజ్జల మాటలు అర్థంలేని విధంగా ఉన్నాయి. కోర్టుకు సాక్ష్యాలు ఇచ్చామని సజ్జల అంటున్నారు. కోర్టు సాక్ష్యాలు లేవని బెయిల్ మంజూరు చేసింది. రెండు వందల సార్లు కోర్టు మొట్టికాయలు పడి వైసీపీ నేతల శరీరరం మొద్దు భారీ పోయింది. జగన్‌కి నిజాయతీ ఉంటే వందసార్లు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. జగన్‌కి కోర్టు మొట్టికాయలు వేసింది. చంద్రబాబుపై వైసీపీ నేతలు కేసు పెట్టి విష ప్రచారం చేశారని అందరికీ తెలుసు. జగన్మోహన్‌రెడ్డిపై పెట్టిన కేసులు ఏమయ్యాయి. సజ్జల అసలు జగన్ కేసులపై మాట్లాడాలి. జగన్‌పై కేసులు పెట్టింది బాబు కాదు సీబీఐ’’ అని కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.

22 కేసుల్లో జగన్మోహన్‌రెడ్డి ముద్దాయి

‘‘22 కేసుల్లో జగన్మోహన్‌రెడ్డి ముద్దాయిగా ఉన్నారు. జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై వచ్చారు ఆయన ముద్దాయి కదా ? చంద్రబాబుపై కేసు పెట్టారు సాక్ష్యాలు లేవు. 29 నుంచి చంద్రబాబుకు ఎలాంటి షరతులు వర్తించవు. 43వేల కోట్లు ప్రజధానాన్ని జగన్ దోచేశారు. జగన్ ఇతర ముద్దాయలను అధికారంలో కూర్చోబెట్టారు. జగన్ న్యాయస్థానికి హాజరుకాకుండా సీఎం పదవిని దుర్వినియోగం చేశారు. సీఐడీ వైసీపీ జేబు సంస్థ. ప్రతిపక్ష నేతలపై మాత్రమే కేసులు పెడుతున్నారు. చంద్రబాబుపై ఎలాంటి అవినీతి ఆరోపణలు నిరూపించలేరు. వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అధికార దుర్వినియోగం చేశారు. వివేకానందరెడ్డి కేసులో పాత్రధారులు మాత్రమే బయటకు వచ్చారు...ఇంకా సూత్ర దారులు రాలేదు. వివేకా కేసులో మొదట వైసీపీ నేతలు నిర్దోషిగా బయటకు రావాలి. వివేకానందరెడ్డి కేసులో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రజావేదికను కూల్చివేశారు... బాబు గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదు. వైసీపీకి పాలన చేసే నైతిక హక్కు లేదు. తెలంగాణ సీఎం, మంత్రులు రోజు మీ పాలన గురించి మాట్లాడుతున్నారు’’ అని కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-20T21:02:54+05:30 IST