MP Raghurama: కృష్ణ నదీజలాల సమస్యను తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-10-07T16:53:05+05:30 IST

కృష్ణ నదీజలాల సమస్యను తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్ పరిష్కరించాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు.

MP Raghurama: కృష్ణ నదీజలాల సమస్యను తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిష్కరించాలి

ఢిల్లీ: కృష్ణ నదీజలాల సమస్యను తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్ పరిష్కరించాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఢిల్లీలోని తన నివాసంలో రఘురామ మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ జల వివాదం పరిష్కారం చేస్తామని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి ఒక లేఖ రాశారు. కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని పున: పంపిణీ చేయాలన్న నిర్ణయంపై సీఎం జగన్‌రెడ్డి అభ్యతరం తెలిపారు. కానీ రాత్రి గెజిట్ విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని సీఎం జగన్‌రెడ్డి అపాయింట్మెంట్ అడిగారు కాని ఇవ్వలేదు. బీజేపీ చెప్తే చేసినట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచారం చేసుకున్నారు. పోలవరం నిధులు, విశాఖ ఉక్కుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సంబంధ ఏంటో అర్థం కాదు.

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాతో ఏపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సొంతపుత్రుడు అని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ఆస్తులు ఎలాగో హైదరాబాద్‌లో ఉన్నాయి. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు వెళ్తే పట్టించుకోరు. మిగులు జలాలు కింద ఉన్న రాష్టానికి దక్కుతాయి. కృష్ణాజలాలు వృథా కాకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గతంలో చర్యలు చేపట్టారు. మిగులు జలాలను తెలంగాణ ప్రభుత్వం తోడుకుంటానని చెబుతోంది. ఎప్పుడు నీటి సమస్యకు పరిష్కారం వస్తుందో..? నీటి సమస్యలు వస్తాయని గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి చెప్పారు. కృష్ణా నది జలాల సమస్యను పరిష్కరించే వరకు జగన్‌రెడ్డి కేంద్రంపై పోరాటం చేయాలి’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-07T16:53:05+05:30 IST