MP Raghurama: యువగళం సభకు పవన్ కళ్యాణ్ వస్తారు
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:57 PM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) స్పష్టం చేశారు. సోమవారం నాడు ఢిల్లీలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుందని ఈ కార్యక్రమంలో అభిమానులు, జనసేన -టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావాలి’’ అని ఎంపీ రఘురామ పిలుపునిచ్చారు.
ఢిల్లీ: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) స్పష్టం చేశారు. సోమవారం నాడు ఢిల్లీలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుందని ఈ కార్యక్రమంలో అభిమానులు, జనసేన -టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అవ్వడం మంచి పరిణామం. శత్రువును సమూలంగా ఎదుర్కోవడానికి మంచి నిర్ణయాలు అవసరం. దానికి కావాల్సిన కార్యాచరణ చంద్రబాబు రూపొందిస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశంపై సాక్షి పేపర్ వేదవ ఏడుపులు ఎందుకు. ప్యాకేజీ అంటూ రాయడం మొదలు పెట్టారు...మీ కన్నా ప్యాకెజీలు ఎవరు ఇవ్వగలరు. పాదయాత్రలో లోకేష్ సక్సెస్ అయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ ముందుకు వెళ్తున్నారు. పర్యటన ముందు లోకేష్ వేరు ఇప్పుడు లోకేష్ వేరు. యువగళం సభ ఎల్లుండి అద్భుతంగా జరుగుతుంది. మూడోపార్టీ కూడా త్వరలో కలుస్తుందని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమావేశం విజయవంతం అయ్యింది’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు.