Nakka Anand Babu: అనంతబాబు సస్పెన్షన్‌పై జగన్‌రెడ్డివీ ఉత్తుత్తి ప్రకటనలేనా..?

ABN , First Publish Date - 2023-09-29T19:08:30+05:30 IST

దళితుడిని దారుణంగా హతమార్చిన నిందితుడితో సీటు, స్వీట్లు పంచుకోవడం జగన్‌రెడ్డి దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు(Nakka Anand Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nakka Anand Babu: అనంతబాబు సస్పెన్షన్‌పై జగన్‌రెడ్డివీ  ఉత్తుత్తి ప్రకటనలేనా..?

అమరావతి: దళితుడిని దారుణంగా హతమార్చిన నిందితుడితో సీటు, స్వీట్లు పంచుకోవడం జగన్‌రెడ్డి దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు(Nakka Anand Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్‌రెడ్డికి దళితుల పొడ గిట్టదని అనంతబాబు వ్యవహారంతో తేలిపోయింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్న జగన్‌రెడ్డి...అతనితో వేదిక ఎలా పంచుకున్నాడు? దళితులను వంచించడానికే జగన్‌రెడ్డి తన పార్టీ తరుపున అనంతబాబు సస్పెన్షన్‌పై ఉత్తుత్తి ప్రకటనలు చేయించాడు. అనంతబాబు గంజాయిసాగు..రంగురాళ్ల వ్యాపారంతో నెలనెలా తనకు వందలకోట్ల కప్పం కడుతున్నందునే జగన్ అతన్ని అక్కున చేర్చుకుంటున్నాడు. మాట్లాడితే నా ఎస్సీలని గుండెలు బాదుకుంటూ గొంతు చించుకునే జగన్‌రెడ్డి అనంతబాబుపై ఏం చర్యలు తీసుకుంటాడో దళితులకు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి దళితజాతి వినాశనమే లక్ష్యంగా వ్యవహరిస్తుంటే వైసీపీ దళిత నేతలు..మంత్రులు ఎందుకు నోరెత్తరు?జగన్‌రెడ్డికి దళితులపై ఏమాత్రం అభిమానమున్నా తక్షణమే తన పార్టీ , ప్రభుత్వం నుంచి అనంతబాబుని సస్పెండ్ చేయాలి’’ అని నక్కా ఆనంద్‌బాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-29T19:08:30+05:30 IST