Nandedla Manohar: నిన్నటి పరిణామాలపై కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-10T19:08:32+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.

Nandedla Manohar: నిన్నటి పరిణామాలపై కీలక వ్యాఖ్యలు

అమరావతి: నిన్నటి పరిణామాలపై జనసేన నేత నాందెడ్ల మనోహర్ (Nadendla Manohar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు జనసేన(Janasena) రాష్ట్ర కార్యాలయంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాందెడ్ల మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను(Nara Chandrababu Naidu) ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. నిన్నటి పరిణామాలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ పార్టీగా జనసేన ప్రజల పక్షాన నిలబడింది. హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలనేది పవన్ కల్యాణ్(Pawan Kalyan) విధానం. రాజకీయ పార్టీగా ప్రజల్లోకి మరింత చేరువ అయ్యేలా కార్యక్రమాలు చేయాలి. ఎటువంటి పరిణామాలు ఎదురైనా.. మనం నిలబడ్డాం.

గతంలో విశాఖపట్నంలో జనవాణికి వచ్చిన పవన్‌ను అడ్డుకున్నారు. అధికార దుర్వినియోగంతో భయభ్రాంతులకు గురి చేయాలని కుట్ర చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పని చేస్తుందో చూస్తున్నాం. జగన్ మంచి చేస్తే హర్షించాం.. చెడు చేస్తే.. ప్రశ్నించాం. వలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం చేస్తున్న అరచకాలను బయట పెట్టాం. మీడియా సమావేశాల ద్వారా విమర్శలకే పరిమితం కాకుండా.. ప్రజా సమస్యల పరిష్కారం పైనే మనం దృష్టి పెట్టాలి. జగన్ ప్రభుత్వం అరాచకాలను కలిసి కట్టుగా ఎదుర్కొన్నాం. పవన్ కల్యాణ్ విధానాలను అందరూ అర్ధం చేసుకుని ప్రజల మధ్యకు వెళ్లండి.వారాహి యాత్ర కూడా త్వరలోనే తూర్పు కృష్ణాలో ప్రారంభిస్తాం’’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-10T19:12:40+05:30 IST