Pattabhiram:సైకో ముఖ్యమంత్రిని గద్దె దింపే వరకు ప్రజా క్షేత్రంలో పోరాడుదాం
ABN , First Publish Date - 2023-09-29T17:12:55+05:30 IST
సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy)ని గద్దే దింపే వరకు ప్రజా క్షేత్రంలో పోరాడుదామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాం(Pattabhiram) వ్యాఖ్యానించారు.
ఏలూరు: సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy)ని గద్దే దింపే వరకు ప్రజా క్షేత్రంలో పోరాడుదామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాం(Pattabhiram) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను అంధకారంలో వైసీపీ ప్రభుత్వం నెట్టి వేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబుపై పోరాడలేక జగన్మోహన్‌రెడ్డి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు.
సైకో జగన్ ఇటీవలే పదేళ్ల జైలు వార్షికోత్సవం జరుపుకున్నారు. జగన్ అవినీతి కేసుల్లో పదేళ్లుగా బయట తిరుగుతున్నాడు. లోకేష్ పాదయాత్రను కూడా అడ్డుకునేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజలందరూ జగన్మోహన్‌రెడ్డిని ఛీ కొడుతున్నారు. మాకు న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు’’ అని పట్టాభిరాం పేర్కొన్నారు.