Raghurama: ప్రధాని మోదీని అవమానిస్తున్న జగన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-09-13T15:33:45+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పూర్తిగా అధ్యయన చేసిన తర్వాతనే గుజరాత్‌లో స్కిల్ డెవలప్మెంట్‌(Skill development) ను ఏర్పాటు చేశారని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) పేర్కొన్నారు.

Raghurama:  ప్రధాని మోదీని అవమానిస్తున్న జగన్‌రెడ్డి

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పూర్తిగా అధ్యయన చేసిన తర్వాతనే గుజరాత్‌లో స్కిల్ డెవలప్మెంట్‌(Skill development) ను ఏర్పాటు చేశారని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ గుజరాత్‌లో ఒప్పయింది.. ఏపీలో మాత్రం తప్పు ఎలా అవుతుంది..? కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే ప్రోగ్రాం అమలు చేశారు. దిక్కుమాలిన నవరత్నాలు మా వాళ్లు పెట్టారు, సరిగా అమలు కూడా చేయలేరు. జగన్ 7వేల కోట్లు పెట్టీ మీటర్లు పెట్టారు, అందులో 3వేల కోట్లు కొట్టేశారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా2లక్షల 70 వేల మందికి ఉపాధి హామీని చంద్రబాబు(Chandrababu) కలిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో అసలు కుంభకోణం లేదు. రామతీర్థంలో రాముడి తల తీసేశారు, రథం మావాళ్లు తగలబెట్టారు. పిచ్చి పిచ్చి కేసులు పెట్టీ రాష్ట్రాన్ని తగలపెడుతున్నారు. ఇండియా బెస్ట్ స్టేట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అవార్డు కూడా జగన్ వచ్చిన కొత్తలో తెచ్చుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్‌ను జగన్‌రెడ్డి ప్రధానమంత్రి మోదీని అవమానిస్తున్నారు. చంద్రబాబు నాయుడును ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటీ’’ అని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.

Updated Date - 2023-09-13T15:33:45+05:30 IST