Sajjala Ramakrishna Reddy : కేసీఆర్‌కి ఏపీ అభివృద్ధి కనిపించడం లేదు
ABN , First Publish Date - 2023-11-02T20:30:37+05:30 IST
క్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా రోడ్లు గురించి మాట్లాడం విచిత్రంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) అన్నారు.
విజయవాడ: పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా రోడ్లు గురించి మాట్లాడం విచిత్రంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) అన్నారు. గురువారం నాడు తాడేపల్లిలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో అక్కడ ఉన్న ప్రజలకి తెలుసు. తెలంగాణలో కలిపిన పోలవరం ముంపు గ్రామంలో ఉన్న ఏడు గ్రామల ప్రజలు ఏపీలోకి వస్తాం అంటున్నారు. ఆ గ్రామల్లోని ప్రజలు ఎందుకు ఏపీలో కలుస్తామని వస్తున్నారు కేసీఆర్ ముందు తెలుసుకోవాలి. ఏపీలో అభివృద్ధి చూసి ఏపీలోకి వస్తున్నామని 7గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఏపీలో అభివృద్ధి చూసి దేశం మొత్తం గర్విస్తుంది..కేసీఆర్‌కి ఏపీ అభివృద్ధి కనిపించడం లేదు. గతంలో ఏపీలో పింఛన్లు ఎలా అమలు చేస్తున్నారని తెలుసుకొని తెలంగాణలో కూడా అదే విధంగా అమలు చేయాలని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాఠశాలలు తెలంగాణలో పాఠశాలలను పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో అనేది పూర్తిగా అర్థమవుతుంది. అనారోగ్యం బాగాలేదని చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మూడు గంటల్లో రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి చంద్రబాబుకు 14 గంటలు సమయం పట్టింది. అనారోగ్యం ఉన్న వ్యక్తి ఎవరైనా 14 గంటలు కారులో కూర్చుంటారా...? చంద్రబాబునాయుడుకు అర్ధరాత్రి వరకు రోడ్లు మీద ఉండి బ్రహ్మరథం పట్టారని కొంతమంది వ్యాఖ్యలు చేయటం హాస్యంగా ఉంది. హైదరాబాదులో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది .ట్రాఫిక్ జాం ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్ పెట్టి ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పటం సిగ్గుగా ఉంది. హైదరాబాదులో చంద్రబాబును చూసేందుకు వచ్చింది పచ్చ బ్యాచ్ మాత్రమే’’ అని సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు.