TDP: అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు ఏపీ బంద్‌.. పిలుపునిచ్చిన టీడీపీ

ABN , First Publish Date - 2023-09-10T20:37:17+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పై ఆంధ్రప్రదదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

TDP: అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు ఏపీ బంద్‌.. పిలుపునిచ్చిన టీడీపీ

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పై ఆంధ్రప్రదదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నేడు ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై ఏపీ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఆందోళనలో భాగంగా రేపు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు(Achchennaidu) ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ, జగన్‌రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు అనగా సోమవారం 11.09.2023 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి’’ అని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-09-10T20:49:26+05:30 IST