Nimmala Ramanaidu: వైసీపీ సర్కార్ తీరును అసెంబ్లీలో ఎండ కడతాం
ABN , First Publish Date - 2023-09-20T14:14:21+05:30 IST
చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu Arrest) అంశంపై గళమెత్తేందుకు చట్ట సభల వేదికగా చెబుతాం. నాలుగేళ్లు అసెంబ్లీలో వైసీపీ వ్యవహార శైలిపై చర్చించాం. తీర్మానాలు ఇచ్చినా తిరస్కరిస్తున్నారు. వైసీపీ సభ్యులే ఏడు, ఎనిమిది గంటలు మాట్లాడుతున్నారు.
అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. టీడీఎల్పీ సమావేశం అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu Arrest) అంశంపై గళమెత్తేందుకు చట్ట సభల వేదికగా చెబుతాం. నాలుగేళ్లు అసెంబ్లీలో వైసీపీ వ్యవహార శైలిపై చర్చించాం. తీర్మానాలు ఇచ్చినా తిరస్కరిస్తున్నారు. వైసీపీ సభ్యులే ఏడు, ఎనిమిది గంటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం. సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని నిర్ణయం. మైక్ ఇవ్వకపోవడం, సస్పెండ్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటే బయటకు వచ్చి నిరసన తెలిపి ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయించింది. చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రధాన ఎజెండాతోనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాం. సభ లోపల అవకాశం ఇవ్వకుంటే.. జగన్ అవినీతి కేసుల అంశాన్ని ప్రజా క్షేత్రంలో ఎండ కడతాం. ఇంకా తదుపరి అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నాయన్న అంశంపైనా టీడీఎల్పీలో చర్చించాం. సమావేశాలు జరుగుతున్నన్ని రోజులు అసెంబ్లీ లోపలా, బయటా పార్టీ కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలంతా నిర్ణయించారు. రేపు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తాం. ఏ రోజు అంశాల్ని ఆ రోజు చర్చించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం.’’ అని నిమ్మల రామానాయుడు తెలిపారు.
బీ.టీ నాయుడు..
‘‘మంత్రి జోగి రమేష్ వేసిన సవాల్‌ని స్వీకరిస్తాం. అసెంబ్లీకి వస్తే 70ఎంఎం చూపిస్తే మేము కూడా మంత్రి జోగికి ఐమాక్స్ సినిమా చూపిస్తాం.’’ అని బీ.టీ నాయుడు పేర్కొన్నారు.