Teachers' Bills: టీచర్స్ డే రోజు ..ఆగమేఘాల మీద వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే..!

ABN , First Publish Date - 2023-09-05T19:55:56+05:30 IST

నిన్నటి వరకు ఉపాధ్యాయులకు వేతనాలు(Salaries of teachers) రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీతాలు రాక టీచర్లు ఆందోళన బాట పట్టారు. వేతనాలు ఆలస్యం అయితే ఉపాధ్యాయుల దినోత్సవం(Teacher's Day) రోజు కూడా చెడ్డపేరు వస్తోందని వైసీపీ ప్రభుత్వం(YCP Govt) భావించింది.

Teachers' Bills: టీచర్స్ డే రోజు ..ఆగమేఘాల మీద వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే..!

అమరావతి: నిన్నటి వరకు ఉపాధ్యాయులకు వేతనాలు(Salaries of teachers) రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీతాలు రాక టీచర్లు ఆందోళన బాట పట్టారు. వేతనాలు ఆలస్యం అయితే ఉపాధ్యాయుల దినోత్సవం(Teacher's Day) రోజు కూడా చెడ్డపేరు వస్తోందని వైసీపీ ప్రభుత్వం(YCP Govt) భావించింది. ఇదే అదునుగా ఆగమేఘాల మీద ఉపాధ్యాయుల బిల్లులను ఒక్కసారిగా సంబంధిత వైబ్‌సైటులో అప్‌డేట్ చేసింది. బిల్లులు మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే వెళ్లాలని ట్రెజరీ కార్యాలయాలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో గురుపూజోత్సవం రోజు కూడా ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోవడంపై ‘‘ఏబీఎన్, - ఆంధ్రజ్యోతి’’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలతో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కథనాలు సర్య్కూలేట్ అయ్యాయి. సోమవారం రాత్రి వరకూ కూడా ఉపాధ్యాయుల గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. గురుపూజోత్సవం రోజు కూడా వేతనాలు అందకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుభీకింది. రేషనలైజేషన్‌లో సర్దుబాటు అయిన 30 వేల మంది ఉపాధ్యాయులకు 3 నెలల నుంచి వేతనాలు అందక నరకయాతన పడ్డారు. క్యాడర్ స్ట్రెంగ్త్ పేరుతో పేరోల్ వెబ్‌సైట్ క్లోజ్ చేయడంతో వేతనాలు అందరికీ ఆగిపోయాయి. గురువారం సాయంత్రానికి రాష్ట్రంలో లక్షా 70 వేల మందికి వేతనాలు పడనున్నాయి.

Updated Date - 2023-09-05T20:08:41+05:30 IST