TDP- CPI Alliance: ఏపీలో ఆసక్తికర పరిణామం.. టీడీపీతో పొత్తుకు సీపీఐ సిద్ధం

ABN , First Publish Date - 2023-09-29T22:00:14+05:30 IST

ఏపీలో ఆసక్తికర పరిణామంచోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీతో నడిచి వచ్చేందుకు సీపీఐ(CPI) సిద్ధమవుతోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) కూడా ఈపొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

TDP- CPI Alliance: ఏపీలో ఆసక్తికర పరిణామం.. టీడీపీతో పొత్తుకు సీపీఐ సిద్ధం

అమరావతి: ఏపీలో ఆసక్తికర పరిణామంచోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీతో నడిచి వచ్చేందుకు సీపీఐ(CPI) సిద్ధమవుతోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) కూడా ఈపొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ABN డిబేట్‌లో భాగంగా తెలుగుదేశం - సీపీఐ పొత్తుకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.దీంతో సీపీఐ కీలక నిర్ణయం ఏపీలో ఆసక్తికరంగా మారింది. ABN డిబేట్‌లో రామకృష్ణ మాట్లాడుతూ... ‘‘టీడీపీతో జత కడతాం. టీడీపీతో కలిసి పనిచేస్తాం. ప్రజాసమస్యలపై టీడీపీతో కలిసి పోరాటం చేస్తాం. జగన్‌ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం’’ అని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు.

కాగా.. సీపీఎం సీనియర్ నేత గఫూర్ ABN డిబేట్‌లో తెలుగుదేశం - సీపీఐ పొత్తు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- సీపీఐ పొత్తు పెట్టుకుంటుదంటునే ఓ షరతు విధించారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘బీజేపీ(BJP)ని దూరం పెడితే మేము కూడా టీడీపీతో కలిసి పనిచేస్తాం. జగన్ ప్రభుత్వం మళ్లీ రాకుండా చేయడమే మా లక్ష్యం. ఎట్టిపరిస్థితుల్లోనైనా వైసీపీతో జత కట్టే ప్రసక్తే లేదు’’ అని గఫూర్ తెలిపారు. ఈ పొత్తు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అలాగే .. ఏపీ వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించబోతున్నాయి. టీడీపీ సీపీఐ పొత్తుపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలిక.

ఇప్పటికే.. తెలుగుదేశం - జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితులపై రెండు పార్టీలు కలిసి వైసీపీ అవినీతి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చర్యలపై పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు సీపీఐ కూడా ఈ పొత్తుకు సపోర్టు చేస్తుడడంతో వైసీపీకి ఇక కష్టకాలమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌.. వైసీపీపై సీపీఐ పోరాటం..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను సీపీఐ ఖండించిన విషయం తెలిసిందే. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని.. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా తప్పుబట్టింది. పలు జిల్లాల్లో టీడీపీకి బాసటగా సీపీఐ నేతలు రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా చేశారు. వైసీపీ ప్రభుత్వం నియంత పోకడులను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంలో తెలుగుదేశం ఇచ్చిన బంద్ పిలుపునకు జనసేన సీపీఐ కూడా తెలుగుదేశం నాయకుల వెంట నడిచారు. ఈ పొత్తు అంశంపై మూడు పార్టీలు కలిస్తే రాష్ట్రంలో ప్రభజనం సృష్టించవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు.

Updated Date - 2023-09-29T22:43:29+05:30 IST