YCP VS TDP: తాడికొండలో టీడీపీ దీక్ష శిబిరంపై రాళ్ల దాడి.. పరిస్థితి ఉద్రిక్తం.. ఆ నేత లక్ష్యంగానే దాడి..!
ABN , First Publish Date - 2023-09-21T20:42:09+05:30 IST
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్(Chandrababu Illegal Arrest)కు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. పలు పార్టీలు వైసీపీ ప్రభుత్వం(YCP Govt), ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్(Chandrababu Illegal Arrest)కు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. టీడీపీ నేతలు, చంద్రబాబు అభిమానులు వైసీపీ ప్రభుత్వం(YCP Govt), ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) తీరుపై రోజుకోక పద్ధతిలో తీవ్ర నిరసనలు చేపడుతున్నారు. ప్రజల్లో రోజురోజుకూ టీడీపీ పార్టీపై అపూర్వ స్పందన లభిస్తోండడంతో వైసీపీ నేతలు(YCP Leaders) జీర్ణించుకోలేక పలు కుయుక్తులకు పాల్పడుతున్నారు. గురువారం నాడు తాడికొండ(Tadikonda) అడ్డరోడ్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. కాగా.. వైసీపీ మూకలు తెలుగుదేశం దీక్ష శిబిరంపై విరుచుకుపడి అక్కడున్న నాయకులు, కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి చేశారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరర్రావు(YCP MLA Namburi Shankarrao) అనుచరులు ఒక్కసారిగా టీడీపీ దీక్ష శిబిరంపై రాళ్లు రువ్వారు. దీంతో టీడీపీ శిబిరం దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వినాయక నిమజ్జనానికి వెళ్తూ టీడీపీ శిబిరంపై వైసీపీ శ్రేణులు రాళ్లు దాడి చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ మూకల దాడి నుంచి శ్రావణ కుమార్‌ను టీడీపీ నేతలు కాపాడారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. గాయాలయిన నాయకులను ఆస్పత్రికి తరలించారు.
దాడిపై శ్రావణ్ కుమార్ ఏమన్నారంటే..
వైసీపీ నేతల(YCP Leaders )కు దళితులంటే చిన్నచూపు. అందుకే దాడి చేశారని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ (Tenali Shravan Kumar) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్టు(Chandrababu Illegal Arrest) ను నిరసిస్తూ ఈరోజు ఎస్సీ, ఎస్టీలతో దీక్షలు నిర్వహిస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు (YCP MLA Namburi Shankarrao) అనుచరులు వినాయక నిమజ్జనం కోసం వెళ్తూ దీక్ష శిబిరంపై దాడి చేశారు. కాసేపు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా మేం సంయమనంతో ఉన్నాం. ముందుకు వెళ్లిన వైసీపీ మూకలు వెనక్కు వచ్చి మరీ రాళ్లు వర్షం కురిపించారు. నంబూరి శంకర్రావు భార్య విగ్రహం వెంట కారులో ఉన్నారు. పవిత్రమైన వినాయక నిమజ్జనానికి వెళ్తూ ఇలాంటి దుశ్చర్యలేంటి..? వైసీపీ నేతలకు దేవుడంటే కనీసం భక్తి, భయం లేదు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నామని శ్రావణ్ కుమార్ తెలిపారు. ఇంత జరిగినా పోలీసులు కనీసం అటువైపు కూడా చూడలేదని అక్కడున్న వారు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.