Chandrababu: మంగళవారం హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్‌పై విచారణ
ABN , First Publish Date - 2023-09-18T21:39:11+05:30 IST
మంగళవారం ఏపీ హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, ఎఫ్‌ఐఆర్( FIR) క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అమరావతి: మంగళవారం ఏపీ హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, ఎఫ్‌ఐఆర్( FIR) క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టులోనే మరో బెంచ్‌లో ఇన్నర్ రింగ్ రోడ్ మార్పు కేసులో చంద్రబాబుకు బెయిల్ అంశంపై కూడా విచారణ జరగనుంది. రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్‌పై సీఐడీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించే అవకాశం ఉంది. ముకుల్ రోహత్గి వాదనలు వర్చువల్‌గా ఉంటాయని సమాచారం. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్ర వాదనలు వినిపించనున్నారు. అవసరమైతే మరో సీనియర్ న్యాయవాది కూడా చంద్రబాబు తరపున హాజరు అవుతారని సమాచారం. అలాగే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌లపై విచారణ జరగనుంది. కౌంటర్ దాఖలు చేయాలని శనివారం సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాతే ఏసీబీ కోర్టులో విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.