YS Viveka Case : ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2023-04-27T11:51:43+05:30 IST

సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు లో ఎర్ర గంగి రెడ్డి బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది.

YS Viveka Case : ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ : సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka murder Case)లో ఎర్ర గంగి రెడ్డి బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. సీబీఐ ముందు మే 5 వరకూ లొంగిపోకుంటే, గంగిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టు ముందు మే 5 లోపు లొంగిపోవాలని గంగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై హైకోర్టులో నిన్న వాదనలు ముగిశాయి. సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు విచారణకు సహకరించడం లేదని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. గంగిరెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేయడంలేదని గంగిరెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు నేటి(గురువారం)కి వాయిదా వేసింది.

వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. గత రెండు నెలలుగా ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ఈరోజు కూడా బెయిల్‌ రద్దు పిటిషన్‌పై వాదనలు జరుగగా తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎర్రగంగిరెడ్డి బయట ఉండటం సమంజసం కాదని, సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే సాక్ష్యులను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని అలాగే సాక్షాలను తారుమారు చేస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఎర్రగంగిరెడ్డి ఎక్కడా కూడా సాక్ష్యులను ప్రభావితం చేయలేదని ఎర్రగంగిరెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఎర్రగంగిరెడ్డి బెయిల్ నిబంధనలు విస్మరించకుండా.. నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని తెలిపారు. సీబీఐ అధికారులు పిలిచిన ప్రతీసారి ఎర్రగంగిరెడ్డి విచారణకు హాజరయ్యారని, 72 సార్లు సీబీఐ ఎదుట హాజరయ్యారని కోర్టుకు చెప్పారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. గురువారం తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.

గతంలో ఎర్రగంగిరెడ్డి బెయిల్‌‌ను రద్దు చేయాలని ఏపీ హైకోర్టును (AP Highcourt) సీబీఐ ఆశ్రయించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీం కోర్టులో (Supreme Court) పిటిషన్‌ వేసింది. అయితే అప్పటికే వివేకా కేసు తెలంగాణకు బదిలీ అయిన నేపథ్యంలో హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం సూచించింది. ఈ మేరకు ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ... తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈరోజు హైకోర్టులో వాదనలు ముగియగా.. తీర్పు రేపటికి వాయిదా పడింది. ఈ క్రమంలో ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-04-27T11:55:11+05:30 IST