Share News

AP News: గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-12-01T16:15:35+05:30 IST

విభజన హామీల విషయంలో షెడ్యూల్ ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలి. పోలింగ్ జరిగే రోజున ఇటువంటి గొడవలు చేయడం దురదృష్టకరం.

AP News: గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు

విజయవాడ: రాష్ట్రంలో కరువు కాటకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) ఆరోపించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఏపీ కాంగ్రెస్ నేతలు కలిశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. ‘‘687 మండలాల్లో కరువు ఉందని నివేదికలు చెబుతున్నా.. ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. పల్నాడు, కర్నూలులో రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కరువు కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలి. కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఉపాధి లేక సొంతిల్లు నుంచి వలస పోతున్నారు. నీళ్ల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. విభజన హామీల విషయంలో షెడ్యూల్ ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలి. పోలింగ్ జరిగే రోజున ఇటువంటి గొడవలు చేయడం దురదృష్టకరం. పోలింగ్ రోజున డైవర్ట్ చేయడానికి నీటి పంపకాల పేరుతో ఏమి చేసినా ప్రజల చూస్తూ ఊరుకోరు.’’ అని తెలిపారు.

sagar.jpg

Updated Date - 2023-12-01T16:20:46+05:30 IST