Bonda Uma: వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు

ABN , First Publish Date - 2023-10-10T15:11:54+05:30 IST

నాలుగున్నర సంవత్సరాల జగన్ (Cm jagan) అవినీతి పాలనను ప్రజలు ‘ఏపీ హేట్స్ జగన్’ అంటున్నారు. మొన్నటి వరకు వైసీపీ ‘నువ్వే మా నమ్మకం జగనన్న‘ అని అన్నారు. ఇప్పుడేమో ప్రజలు నిన్ను నమ్మం జగన్ అంటున్నారు

Bonda Uma: వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు

విజయవాడ: వైసీపీ ప్రభుత్వాన్ని (Ycp Government) ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ (Bonda Umamaheswara Rao) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాలుగున్నర సంవత్సరాల జగన్ (Cm jagan) అవినీతి పాలనను ప్రజలు ‘ఏపీ హేట్స్ జగన్’ అంటున్నారు. మొన్నటి వరకు వైసీపీ ‘నువ్వే మా నమ్మకం జగనన్న‘ అని అన్నారు. ఇప్పుడేమో ప్రజలు నిన్ను నమ్మం జగన్ అంటున్నారు. ఎన్నికల ముందు 600 వందల వాగ్దానాలు చేసిన జగన్.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీ అమలు చేయని పార్టీగా రికార్డులోకి ఎక్కింది. దేశంలో అత్యంత ధనిక సీఎంగా జగన్ రికార్డు సాధించారు. ఏపీలో పేదవాడి జీవితాన్ని తల కిందులు చేశారు. దళితుడిని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకుని దళితుల గురించి మాట్లాడే నైతిక ఆర్హత జగన్‌కు లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్‌కు చెందిన లక్ష కోట్ల నిధులను దారి మళ్లించి వాళ్లకు ద్రోహం చేసిన సీఎం జగన్. మద్య నిషేధం అని చెప్పి.. మద్యాన్ని గడప గడపకు తీసుకెళ్లారు. కరెంటు చార్జీలు పెంచనంటూ రూ.50 వేల కోట్లు పెంచారు.’’ అంటూ బోండా ఉమ ధ్వజమెత్తారు.

Updated Date - 2023-10-10T15:11:54+05:30 IST